4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఆయిల్ పామ్ తోటలో.. ఏ ఐ రోబో

 కృత్రిమ మేధ ఆధారిత యంత్ర పరికరాల పై పరిశోధన లు విస్తృతంగా చేస్తున్నట్లు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. డీ. రాజిరెడ్డి గారు తెలిపారు. రాజేంద్ర నగర్ లోని ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ లో ఇటీవల నాటిన నూతన ఆయిల్ పామ్ తోటలో అంతర పంటల వరుసల మార్కింగ్ కోసం ఏ ఐ రోబో ట్రయల్ రన్ ను గురు వారం విజయ వంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆయిల్ పామ్ తోటలో కూర గాయలు, పూలు వంటి అంతర పంటల సాగు ను యంత్రాల సహాయంతో విజయ వంతంగా సరి చేయడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. 

16, ఆగస్టు 2026, ఆదివారం

ఇది ఆకు కూరల జాతర..

 పాలకూర ,తోటకూర ,మెంతికూర ,పొన్నగంటి కూర ఇవన్నీ మనకు తెలిసిన ఆకుకూరలు. పొలాల్లో విత్తనాలు చల్లితే సాగుతాయి. కానీ విత్తనాలు చల్లడం, నీరు పెట్టాల్సిన అవసరం లేకుండానే పంట పొలాల్లో కలుపు మొక్కలుగా పెరిగే ఆకుకూరలు కూడా చాలా రకాలు ఉన్నాయి. సహజ సిద్ధంగా పంట పొలాల్లో పెరిగే జొన్న చెంచాలి కూర, ఎలుక చెవుల కూర ,అడవి సోయకూర, తెల్ల గర్జల కూర, బంకటి కూర ,తడకదొబ్బుడు, పప్పు గునగ కూర ,ఉత్తరేణి ,తుమ్మి కూర ఇలాంటి ఎన్నో ఆకుకూరలు పంట పొలాల్లో కలుపు మొక్కలుగా పెరుగుతుంటాయి.  తెలిసినవారు వీటిని బేషుగ్గా వండుకొని తింటారు .జహీరాబాద్రు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ కలుపు కూరలను పోషకాల గనులుగా భావించి తింటుంటారు. ఈ ప్రాంతంలోని పంట పొలాల్లో సహజ సిద్ధంగా లభించే 60కి పైగానే ఉన్న ఆకు కూరలను జాతీయ పోషకాహార సంస్థలో పరీక్ష చేయించగా వీటిలో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నాయని తేలింది. ఈ ఆకుకూరల ప్రత్యేకతను చాటేందుకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ- కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో" సాగు చేయని ఆకుకూరల పండుగను " ఏటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో ఆకుకూరలు వండే విధానం ,తినడం వల్ల కలిగే ప్రయోజనాలను నిపుణులతో తెలియజేస్తారు. జహీరాబాద్ మండలం దిడ్గి  గ్రామ శివారులోని డిడిఎస్ కేవీకే కేంద్రంలో ఆదివారం ఒక్కరోజు ఉత్సవం జరగనున్నది. ఈ క్రతువుకు పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు హాజరవుతారు. కాలానుగుణంగా దొరికే ఆకుకూరలు వండుకొని తింటే పోషకాలు సమృద్ధిగా అందుతాయని, ఇవి అద్భుత ఔషధాలనీ డీ డీ ఎస్ మహిళా ప్రతినిధులు, మహిళా రైతులు పేర్కొంటున్నారు. 



పల్లెలో పాల పంపకం..

 పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి కుటుంబమూ పాల ప్యాకెట్ కొనుగోలు తప్పని సరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఊరిలో పాల ప్యాకెట్ కొనడం మచ్చుకైనా కనిపించదు. 

ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ మండలం అల్లికోరి పంచాయతీ లోని పొటంలొద్ది ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ 50 కుటుంబాలే ఉన్నప్పటికీ 250 కి పైగా పశువులు,మేకలు ఉన్నాయి. ఈ పశు సంపద ను పాకలకే పరిమితం చేయకుండా వాటిని ఇంట్లో కూడా స్వేచ్ఛగా తిరగనిస్తూ ఆప్యాయంగా చూసుకుంటారు ఆ గ్రామ వాసులు. వీటి నుండి ఎంత పాల దిగుబడి వచ్చినా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు తప్ప చుక్క కూడా మార్కెట్ లో విక్రయించరు.

పైగా ఈ పశువుల మూత్రం ,పేడతో స్వయంగా సేంద్రీయ ఎరువులను తయారు చేసుకొని ,పంటలు సాగు చేసుకుంటున్నామని ..తమ ఊరిలో కృత్రిమ ఎరువుల వాడకం తక్కువ అని గ్రామ పెద్ద గంగు తెలిపారు.

7 నిమిషాల్లోనే చెఱకు రసం శుద్ధి

 చెఱకు రసం శుద్ధి చేసే పరికరాన్ని ఆవిష్కరించిన ది ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ కు 20 ఏళ్ల కాల పరిమితితో ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ఆంధ్రా షుగర్స్ జే ఎం డీ ముళ్ళపూడి నరేంద్ర నాథ్ మార్గ దర్శకత్వంలో పరికరాల అభివృద్ధి బృందం ఈ యంత్రాన్ని తయారు చేసింది. కేవలం 7 నిమిషాల్లోనే చెఱకు రసాన్ని శుద్ధి చేయడం దీని ప్రత్యేకత అని యాజమాన్యం తెలిపింది. 

24, మే 2026, ఆదివారం

చేపల పెంపకం పై మూడు రోజుల శిక్షణ శిక్షణ

 నేషనల్ ఫిషరీస్ ఆధ్వర్యంలో ఈనెల 28 29 30 తేదీలలో మంచిర్యాలలో ఏర్పాటు..

మత్స్యకారులను రైతులను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 28 29 30 తేదీలలో మత్స్యకారులకు చేపల పెంపకం పై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన 50 మంది మత్స్యకారులను ఎంపిక చేశారు. మత్స్యకారులకు శాస్త్రీయ పద్ధతుల్లో చేపల పెంపకం పై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. చేపల పెంపకం ఉత్పాదకను ఎలా పెంచాలి? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. వీటితోపాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కొర్రమీను/స్నేక్ హెడ్ పెంపకం, యాజమాన్య పద్ధతులపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. జాతీయస్థాయి మత్సరంగ శాస్త్రవేత్తలు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అధికారులు హాజరై మత్స్యకారులు రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారు. ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని అధికారులు కోరారు.

తిరుపతిలో పాలేకర్ శిక్షణ శిబిరం

 ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఐదు రోజుల శిక్షణ శిబిరం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించనున్నారు.

ఈ ఐదు రోజుల రెసిడెన్షియల్ రైతు శిక్షణ శిబిరం జూన్ 10 నుండి 14వ తేదీ వరకు జరగనున్న ది. పాలేకర్ ఆంగ్ల ప్రసాద్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఉంటుంది. స్వచ్ఛంద సేవకులు డాక్టర్ గంగాధర్ విజయ్ రామ్, పారిశ్రామిక వేత్త రామలింగారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని తిరుపతి చంద్రగిరి రోడ్ లోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.హాజరయ్యే రైతులకు హాస్టల్ హెచ్ లో వసతి కల్పించ నున్నారు. గ్రామ స్వరాజ్యం, విష ముక్త, రోగ ముక్త ఆహారోత్పత్తి లక్ష్యంగా సుభాష్ పాలేకర్ కృషి SPK పద్ధతిలో ఇమిడి ఉన్న అన్ని అంశాలపై పాలేకర్ రోజుకు 12 గంటల పాటు లోతుగా శిక్షణ ఇస్తారు.5 రోజులు భోజన,వసతికి 1500 రూపాయలు చెల్లిస్తే చాలు.ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పని సరి.

పూర్తి వివరాలకు 96669 11116,94924 84003,93475 78819 ఫోన్ నెంబర్ లలో సంప్రదించ ాలని తెలిపారు.

21, మే 2026, గురువారం

నిమ్మ దిగుబడి పెరగాలంటే

 వేసవికాలంలో నిమ్మ పండ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెరటి తోట లోని నిమ్మ చెట్టు పుష్కలంగా కాయలు కాయాలంటే.. సరైన పోషణ, సంరక్షణ ముఖ్యం. ఎండల తీవ్రత పెరిగినపుడు నిమ్మ చెట్టు కు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. కాయలు రాలకుండా మంచి దిగుబడి రావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.

ఉష్ణోగ్రత లు పెరిగినపుడు భూమిలో తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. నేల పూర్తిగా ఎండిపోక ముందే నీరు పెట్టాలి.ఐతే మరీ ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఉదయం ఎండ రాకముందు ,సాయంత్రం ఎండ తగ్గిన తర్వాతే నీరు పెట్టడం మంచిది. దీని వల్ల వేర్లు చల్లగా ఉంటాయి. ఎండ దెబ్బ నుండి వేర్లను కాపాడటానికి మొక్కల మొదళ్ల దగ్గిర మల్చింగ్ చేయడం మంచిది.చెట్టు మొదలు చుట్టూ ఎండు గడ్డి , ఎండిన ఆకులు , కొబ్బరి పీచుతో 3-4 అంగుళాల మేర కప్పితే..వేర్లు దెబ్బ తినకుండా ఉంటాయి. నేలలో తేమ ఎక్కువ సేపు ఉంటుంది కూడా.. నేలకు తగిలేలా ఉండే కింది కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల తెగుళ్ళ ఉధృతి తగ్గుతుంది. ఇక నిమ్మలో పూత రాలకుండా ఉండటానికి , కాయల పరిమాణం పెరగడానికి .. ఒక లీటర్ నీటిలో 2గ్రా బోరాన్ ,5 గ్రా జింక్ సల్ఫేట్ ను కలిపి పిచికారీ చేయాలి.ఇంట్లో మిగిలిన పుల్లని పెరుగుతో మజ్జిగ చేసి , నిమ్మ చెట్టు మొదట్లో పోయాలి.చెట్టుపై పిచికారీ చేసినా.. శిలీంధ్ర తెగుళ్లు తగ్గుతాయి..

15, మే 2026, శుక్రవారం

ఈ - ట్రాక్టర్ రైతులకు ఉపయోగకరము

 


తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సి ఎస్ ఐ ఆర్ సీఎం ఈ ఆర్ ఐ ప్రిమాఈటీ 11 అనే స్వదేశీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను అభివృద్ధి చేసింది గురువారం హైదరాబాదులోని ఎన్జీఆర్ఐ లో ఈ ట్రాక్టర్ ను ప్రమోట్ చేయడానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐఏసిటి డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఎం జి ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ సీఎం ఈఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ నరేష్ చంద్ర మురుములతో కలిసి ట్రయల్ రన్ రోడ్ షో న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జింగ్ ద్వారా నడిచే ఏ ట్రాక్టర్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు పొలాలలో ఈ ట్రాక్టర్ సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు తక్కువ వైబ్రేషన్ ఉండడం వల్ల మహిళలు సైతం సునాయాసంగా నడపగల వాహనం ఇది అని వివరించారు 26 హెచ్పీ సామర్థ్యం గల ఈ వాహనంలో 90 శాతం వరకు స్వదేశీ విడిభాగాలు ఉన్నట్లు తెలిపారు

1, మే 2026, శుక్రవారం

నిషేధిత పురుగుమందులను ఆన్లైన్లో విక్రయించవద్దు

 నిషేధిత పారాక్వాట్ సహా ఇతర పురుగుమందు లేవీ ఆన్లైన్లో విక్రయించరాదని ఈ కామర్శ సంస్థ అయిన అమెజాన్ ను తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఆదేశించింది .గురువారం కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు ,అమెజాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు .ఈ కామర్స్ సంస్థల ద్వారా పురుగుమందుల విక్రయాలు, దానివలన ఏర్పడుతున్న అనర్ధాలపై చర్చించారు .

అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మానవ ఆరోగ్యానికి హానికరమైన విషపూరిత పురుగుమందులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయని, వాటిని ఆన్లైన్లో విక్రయించవద్దని అమెజాన్ సంస్థ ప్రతినిధులకు సూచించారు .దీనిపై అమెజాన్ ప్రతినిధులు స్పందిస్తూ వ్యవసాయ కమిషన్ సూచనలను పాటిస్తామని, తమ విక్రయాల జాబితా నుంచి నిషేధిత పురుగుమందులను తొలగిస్తామని చెప్పారు.

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

మైసూరులో కిసాన్ స్వరాజ్ సమ్మేళనం

 ఫిబ్రవరి 27 28 మార్చి ఒకటి తేదీలలో కర్ణాటకలోని మైసూరులో దక్షిణ భారత కిసాన్ స్వరాజ్ సమ్మేళనం జరగనుంది. కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ సహకారంతో అలయన్స్ ఫర్ సస్టైనబుల్ హోలిస్టిక్ అగ్రికల్చర్ ఆశా ఈ ఆరవ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. రెండేళ్లకోసారి ఈ ఉత్సవం జరుగుతుంది .2022 లోను మైసూరులోని జరిగిన సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల నుండి 300 మంది పాల్గొన్నారు .పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు కార్యకర్తలు శాస్త్రవేత్తలు వినియోగదారులను ఒకచోట చేర్చి అఖిలభారత అనధికారిక పౌర స్వచ్ఛంద సేవకుల సమ్మేళనం ఇది .ప్రకృతి ,సేంద్రియ వ్యవసాయ పద్ధతులు రైతుల హక్కులు ,దేశీ వంగడాలు ,వ్యవసాయ సంస్కృతి కలల పరిరక్షణ లక్ష్యంతో చర్చగోస్టులు ,సదస్సులు నిర్వహిస్తారు .విత్తన సార్వభౌమత్వం ,గడ్డి మందులను తట్టుకునే జన్యు మార్పిడి పంటలు, కలుపు యాజమాన్యం వ్యవసాయంలో శ్రమశక్తి ,అడవి జంతువులతో పంటలకు ముప్పును తట్టుకుని నిలబడడం ఎలా? ఇలాంటి అంశాలపై లోతైన చర్చ జరుగుతుంది. 

పాల్గొనదలచిన వారు..

 ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. మూడు రోజులకు వసతి ,భోజనం అన్నీ కలిపి రైతులు విద్యార్థులకు 1500 రూపాయలు, మహిళా రైతులకు 800 రూపాయలు ఇతరులకు 2500 నుండి 3500.

 చివరి తేదీ ..

ఫిబ్రవరి 15 ,2026 .

ఇతర వివరాలు ..810 55 798 39 

ఇమెయిల్.. kisanswarajsammelan2026@Gmail.com

హైదరాబాదులో రైతు బడి అగ్రి షో

 రైతులకు సరికొత్త నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు ఆధునిక సాగు పద్ధతులను పరిచయం చేసే లక్ష్యంతో రైతు బడి అగ్రి షో పేరుతో భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనున్నది. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫిబ్రవరి 20 21 22 తేదీలలో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు రాజేందర్ రెడ్డి తెలిపారు .తమ వ్యవసాయాన్ని నవీకరించుకోవాలి అనే   ఆలోచనతో ఉన్న రైతులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఈ షో నిర్వహిస్తున్నామన్నారు . 500కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని అనేక ప్రాంతాల నుంచి లక్ష మంది కి పైగా రైతులు ఈ కార్యక్రమాన్ని సందర్శించే అవకాశం ఉందని అన్నారు .

వివరాలకు 88971 19694.

www.rbagrishow.com

27, మార్చి 2024, బుధవారం

పాల దిగుబడి కి ఇలా చేస్తే మేలు

 రైతులకు వ్యవసాయంతో పాటు పాడి అభివృద్ధి చెందితేనే గిట్టుబాటుగా ఉంటుంది దీనికి చిన్న చిట్కాలు పాటిస్తే పశువులకు పోషకాలు అందడంతో పాల ఉత్పత్తి పెరుగుతుందని పశువైద్యాధికారి సురేష్ తెలిపారు పచ్చిగడ్డి వెండి గడ్డిని కలిపి ఇవ్వాలి. పచ్చి గడ్డిలో 90 శాతం నీరు ఉంటుంది అదే ఎండు గడ్డిలో 10% నీరు ఉంటుంది రెండు భాగాలు పచ్చి ఒక భాగం వెండి గడ్డి కలిపి అందించాలి పాలు పితికిన తర్వాత మేత వేయాలి దాదాపుడిగా అయినా లేదా నాన్న పెట్టి అయినా ఇవ్వవచ్చు అయితే నానబెట్టడం వల్ల నమ్మడానికి జీర్ణం కావడానికి సౌకర్యంగా ఉంటుంది ఆరు గంటల పాటు నానబెడితే మంచిది

22, మార్చి 2024, శుక్రవారం

కూరగాయల రైతులకు గ్లోబల్ అవకాశాలు

 ప్రణాళికలతో లాభాల సాగు ఎగుమతులపై దృష్టి పెట్టాలి సింజంట ఆసియా పసిఫిక్ విభాగాధిపతి నిశ్చింత భాటియా



తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ కూరగాయల రైతులకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని సరైన పద్ధతుల్లో సాగు శుద్ధి విధానాలను ఆలంపిస్తే వారు భారీ లాభాలు పొందుతారని ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలుగుతారని కూరగాయల విత్తన సంస్థ సింజంట ఆసియా పసిఫిక్ విభాగాధిపతి నిశ్చింత భాటి అన్నారు హైదరాబాద్ శివారులోని నూతనకల్లో తమ సంస్థ తరఫున ప్రపంచ స్థాయి మూడు అత్యాధునిక విత్తన ఆరోగ్య ప్రయోగశాల సీడ్ హెల్త్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరై హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఏమన్నారు అంటే

ప్రపంచ దేశాల్లో 70 శాతం మేర భారత్ లో 80 శాతానికి పైగా ప్రజలు కూరగాయల ఆహారాన్ని భోంచేస్తున్నారు ఆరోగ్యపరంగా కూరగాయల శ్రేష్టమైనవి వాటిని వినియోగించే వారిలో 90 శాతం మందికి అనారోగ్య సమస్యలు లేవు జంక్ ఫుడ్ తినేవారిలో 40 శాతానికి పైగా అధిక బరువు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడించాయి నా ప్రణాళికతోనే కూరగాయల సాగును నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టాలి విత్తన రకాలను ఎంచుకొని కాలానికి అనుకూలంగా పండించాలి పురుగుమందులు కొద్ది మోతాదులోని ఉపయోగించాలి కోత దశతో పాటు నిల్వ శుద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి మార్కెటింగ్ ఏకమతల పైన దృష్టి సారించాలి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ రైతు ఎకరంలో 90 టన్నుల దాకా టమాటాను పండించార. దీని ద్వారా వాణిజ్య పంటల కంటే రెట్టింపు ఆదాయం వచ్చింది కరీంనగర్ కూరగాయల రైతులు లాభాలు గడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి రైతుల్లో ఎక్కువమంది టమాటా సాగుతూ లబ్ధి పొందుతున్నారు ఇజ్రాయిల్ జర్మనీ తదితర విదేశాల్లోనూ కూరగాయల సాగుతూ రైతులు లాభాలను గడిస్తున్నారు

విత్తనాల నాణ్యత ప్రమాణికం సింజంటా భారత్ లోని అతిపెద్ద మూడు కూరగాయల విత్తన సంస్థల్లో ఒకటి ప్రపంచవ్యాప్తంగా 124 దేశాల్లోని 26 పంటలకు విత్తనాలను తయారుచేసి పంపిణీ చేస్తున్నాం తెలంగాణ ఏపీ లలో 160 విత్తన రకాలను విక్రయిస్తున్నాను. విత్తనాలను ఎక్కడికక్కడ స్థానిక రైతులతో సిద్ధం చేస్తున్నాము విత్తనాల నాణ్యతకే ప్రాధాన్యమిస్తున్నాం నిపుణులైన వారితో అన్ని రకాల జర్మినేషన్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే మార్కెట్లో విక్రయిస్తున్నాం దేశంలో ఈ ఏడాది 11 మిలియన్ విత్తన ప్యాకెట్లను విక్రయించాము విత్తన రకాలపై ముందస్తు పరీక్షల కోసం అమెరికా నెదర్లాండ్స్ తో పాటు భారత్లో ల్యాబ్ను ఏర్పాటు చేశాం హైదరాబాద్ నూతనకల్లో ల్యాబ్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన విత్తన పరీక్షా కేంద్రాల్లో ఒకటి భారత్తో ఆసియా పసిఫిక్ మరియు వెలుపల సాగుదారులకు సేవలందిస్తుంది. విత్తన నాణ్యత ప్రమాణాల ద్వారా రైతులకు నమ్మకంతో పాటు లాభాలను అందించేందుకు కృషి చేస్తున్నాం అన్నారు

సాగు పెరిగింది గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కూరగాయల సాగు విస్తీర్ణం 10% మేరా పెరిగింది తక్కువ విస్తీర్ణంలో కొద్ది కాలంలోనే పంటలు చేతికి రావడం వల్ల రైతుల కోసం తగ్గడంతో పాటు లాభాలు వస్తున్నాయి సాధారణ పంటలతో పోలిస్తే కూరగాయల సాగుతూ నష్టపోయే వారి సంఖ్య తక్కువే ప్రపంచవ్యాప్తంగా కూరగాయల మార్కెట్ పరిమాణం 2022లో 650.25 బిలియన్ డాలర్లు దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2023లో అది 814.1 బిలియన్ డాలర్లు సుమారు 66 లక్షల కోట్ల రూపాయలకు చేరింది 2031 నాటికి అది 4914.95 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా

13, మార్చి 2024, బుధవారం

రైతు బడి వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డికి ఐ ఐ ఐ టీ డీ ఆహ్వానం

 ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈనెల 15 16 తేదీలలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రేరణుర్షిప్ సమ్మిట్ 2024లో పాల్గొని ప్రసంగించాలని తెలుగు రైతు బడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఆహ్వానించింది ఆయన తెలుగు రైతులకు డిజిటల్ మీడియా ద్వారా వ్యవసాయ సమాచార అందిస్తున్నారు సదస్సులో వ్యవసాయం అనుబంధ రంగాలలో యువతకు ఉన్న సరికొత్త అవకాశాల గురించి వివరించాలని సంస్థ కోరింది

హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సు

 జూన్ 4 నుంచి 6 వరకు నిర్వహణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 28 దేశాల నుంచి 500 మంది హాజరు అంతర్జాతీయ కామారెడ్డి సంస్థ అంతర్జాతీయ వారి పరిశోధనా సంస్థ తెలిపాంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు వచ్చే జూన్ 4వ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు హైదరాబాద్ లో ఈ సదస్సు జరుగుతుంది సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది సదస్సులో 28 దేశాల నుంచి దాదాపు 500 మంది శాస్త్రవేత్తలు వ్యాపార సంస్థల ప్రతినిధులు ఎగుమతి దిగుమతి దారులు విద్యావేత్తలు వ్యవసాయ పారిశ్రామికవేత్తలు వరి అనుబంధ ఉత్పత్తుల రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు అని ఆయన వివరించారు ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు తెలంగాణలో పండే వారికి పరి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం ద్వారా డిమాండ్ కల్పించడం మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ఈ సతస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు ఈ జతస్సులో ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న వరి రకాలను ప్రదర్శించడమే కాకుండా వాటి ప్రాధాన్యతలను వివరిస్తారని మంత్రి తెలిపారు మన దేశం నుంచి బియ్యం ఒక కోటి 77 లక్షల 86 వేల 92 టన్నులు కాగా అందులో తెలంగాణ నుంచి కేవలం 22,498 మెట్రిక్ టన్నులేనని పేర్కొన్నారు తెలంగాణ నుంచి దాదాపు 8,000 క్వింటాళ్లు సర్టిఫైడ్ విత్తనాన్ని కూడా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని వివరించారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం రకాల ఎగుమతులపై విధించిన నిషేధం వల్ల సన్న బియ్యం పండించిన రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాక రైతులు కొనుగోలు సెంటర్లలో అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు

10, మార్చి 2024, ఆదివారం

ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ

 మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక చర్చ గిరిజన మహిళల పాత్ర పై అభినందనలు భరతనారి శక్తి అద్భుతమని భక్తుల కితాబు

ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలు గిరిజనులు సాగు చేసే అరకు కాఫీకి అంతర్జాతీయంగా మరో ఘనత దక్కింది ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ పై ప్రత్యేక చర్చ జరగడంతో పాటు ప్రశంసలు లభించాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా అరకు కాఫీ ప్రయాణంపై ప్రత్యేక చర్చ జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఐక్యరాజ్యసమితి నాయకులు అరకు కాఫీని భారత నారీ శక్తిని ప్రశంసించారు భారత అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అన్నారు వ్యవసాయం ఆర్థిక డిజిటల్ సాంకేతికత ఆరోగ్యం విద్య అంతరిక్షం విమానాయన రంగాలలో భారత మహిళలు రాణిస్తున్నారు ప్రశంసించారు అరకు కాశీకి అంతర్జాతీయంగా పేరు రావడంలో గిరిజన మహిళలు ఎంతో కృషి చేశారని కొనియాడారు గిరిజన మహిళల విజయగాత స్ఫూర్తిదాయకమన్నారు ఈ ఏడాది జనవరిలో తాను భారత పర్యటనకు వెళ్ళినప్పుడు నారి శక్తిని ప్రత్యక్షంగా చూశానని గుర్తుచేసుకున్నారు ఆ ప్రాంత గిరిజనులకు సాధికారత గౌరవము లభించాలని వక్తలు పేర్కొన్నారు అరకు కాఫీ ఎంతో రుచిగా నాణ్యతగా ఉండేలా గిరిజనులు స్థిరమైన సాగు పద్ధతులు పాటిస్తున్నారని భారత ప్రతినిధి బృందం పేర్కొంది కాఫీ సాగు నుంచి కోత వరకు ఉత్పత్తి ప్రక్రియలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించింది.

5, మార్చి 2024, మంగళవారం

గోడౌన్ లోని పంటపై లోన్

 ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉన్న గోడౌన్లో రైతులు తమ పంటలను స్టోర్ చేసుకుంటే వీటిపై లోన్లు పొందేందుకు కేంద్రం వీలు కల్పిస్తోంది ఎందుకు సంబంధించి ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ సోమవారం ఈ కిసాన్ ఉపజ నిధి డిజిటల్ ప్లాట్ఫార్మ్ ను లాంచ్ చేశారు ఈ ఇనిషియేటివ్ తో రైతుల ఆదాయాలు పెరుగుతాయని అన్నారు వేరే హౌస్ ఓనర్లు చెల్లించి సెక్యూరిటీ డిపాజిట్లను స్టాక్ విలువలో ఒక శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు ప్రస్తుతం ఇది మూడు శాతంగా ఉంది

వంట నూనెల దిగుమతులు తగ్గించేందుకు కొత్త మిషన్. వంట నూనెల దిగుమతులను తగ్గించుకోవడానికి నూనె గింజల ప్రొడక్షన్ పెంచేందుకు ఒక మిషన్ లాంచ్ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సోమవారం పేర్కొన్నారు ఇందుకోసం 11, కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నమని అన్నారు దీనితో పాటు అస్సాంలో ఏర్పాటు చేసిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ఆయన ప్రారంభించారు ఇండియా ఏడాదికి 1.6 కోట్ల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకుంటుంద

ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం

 మా మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో నాలుగు జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం పప్పులు తదితర ఉత్పత్తులను అవని ఆర్గానిక్స్ పేరుతో విశాఖ నగరంలోని నాలుగు రైతు బజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికీ కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతుంది ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోని ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచనను ప్రోత్సహించిన ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్లు ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు బాక్ చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం స్థలంతో పాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది వైర్ ఫెన్సింగ్ డ్రిప్పులు సిబ్బంది జీతాలను మా ఎఫ్ బి ఓ సమకూర్చుతోంది నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటి పంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ళవచ్చు స్కూలు విద్యార్థులకు ఇంటి పంటలు ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశం అని మేం భావిస్తున్నాం యూనివర్సిటీలో ఈ పంటలను రెండు ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది

ఉషా రాజు ఏయూ అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెన్ హబ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం



3, మార్చి 2024, ఆదివారం

45 రోజులకే పొట్టకొచ్చిన వరి పంట

 సాధారణంగా వారి నాటు వేసిన తర్వాత మూడు నెలలకు పొట్టదశకు వస్తుంది కానీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు కిరణ్ సాగు చేసిన వారి 45 రోజులకే పుట్టదశకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది కిరణ్ వివిధ రకాల కంపెనీలకు చెందిన 27 విత్తన సంచులను కొనుగోలు చేసి పంట వేశాడు ఇందులోని ఏడు సంచుల విత్తనాలలో తేడా వచ్చినట్లు రైతు తెలిపాడు సుమారు మూడు ఎకరాలలో సాగుచేసిన వారి 45 రోజులకే పొట్ట దశకు వచ్చినట్లు పేర్కొన్నాడు ఈ ప్రాంత రైతులు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా విత్తనాలు తీసుకొచ్చి నాట్లు వేశారు. వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు



2, మార్చి 2024, శనివారం

రైతులకు ప్రత్యేక శిక్షణ

 జాతీయ పురుగు తెగులు నిఘా సంస్థకు చెందిన మొబైల్ యాప్ పై భిక్కనూరు రైతు వేదికలు రైతులకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్ జీడిమెట్ల లోని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారి సునీత ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పదిమంది ఆదర్శ రైతులకు యాప్ వినియోగము పనితీరు ఉపయోగాలను వివరించారు సహాయ సస్యరక్షణ అధికారులు నీలా రాణి రవిశంకర్ శ్వేతా సుధా రైతులు సంతోష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాజిరెడ్డి నరేష్ స్వామి పాల్గొన్నారు



Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE