Sunday, 10 March 2024

ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ

 మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక చర్చ గిరిజన మహిళల పాత్ర పై అభినందనలు భరతనారి శక్తి అద్భుతమని భక్తుల కితాబు

ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలు గిరిజనులు సాగు చేసే అరకు కాఫీకి అంతర్జాతీయంగా మరో ఘనత దక్కింది ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ పై ప్రత్యేక చర్చ జరగడంతో పాటు ప్రశంసలు లభించాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా అరకు కాఫీ ప్రయాణంపై ప్రత్యేక చర్చ జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఐక్యరాజ్యసమితి నాయకులు అరకు కాఫీని భారత నారీ శక్తిని ప్రశంసించారు భారత అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అన్నారు వ్యవసాయం ఆర్థిక డిజిటల్ సాంకేతికత ఆరోగ్యం విద్య అంతరిక్షం విమానాయన రంగాలలో భారత మహిళలు రాణిస్తున్నారు ప్రశంసించారు అరకు కాశీకి అంతర్జాతీయంగా పేరు రావడంలో గిరిజన మహిళలు ఎంతో కృషి చేశారని కొనియాడారు గిరిజన మహిళల విజయగాత స్ఫూర్తిదాయకమన్నారు ఈ ఏడాది జనవరిలో తాను భారత పర్యటనకు వెళ్ళినప్పుడు నారి శక్తిని ప్రత్యక్షంగా చూశానని గుర్తుచేసుకున్నారు ఆ ప్రాంత గిరిజనులకు సాధికారత గౌరవము లభించాలని వక్తలు పేర్కొన్నారు అరకు కాఫీ ఎంతో రుచిగా నాణ్యతగా ఉండేలా గిరిజనులు స్థిరమైన సాగు పద్ధతులు పాటిస్తున్నారని భారత ప్రతినిధి బృందం పేర్కొంది కాఫీ సాగు నుంచి కోత వరకు ఉత్పత్తి ప్రక్రియలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించింది.