సాధారణంగా వారి నాటు వేసిన తర్వాత మూడు నెలలకు పొట్టదశకు వస్తుంది కానీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు కిరణ్ సాగు చేసిన వారి 45 రోజులకే పుట్టదశకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది కిరణ్ వివిధ రకాల కంపెనీలకు చెందిన 27 విత్తన సంచులను కొనుగోలు చేసి పంట వేశాడు ఇందులోని ఏడు సంచుల విత్తనాలలో తేడా వచ్చినట్లు రైతు తెలిపాడు సుమారు మూడు ఎకరాలలో సాగుచేసిన వారి 45 రోజులకే పొట్ట దశకు వచ్చినట్లు పేర్కొన్నాడు ఈ ప్రాంత రైతులు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా విత్తనాలు తీసుకొచ్చి నాట్లు వేశారు. వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు