రైతులకు సరికొత్త నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు ఆధునిక సాగు పద్ధతులను పరిచయం చేసే లక్ష్యంతో రైతు బడి అగ్రి షో పేరుతో భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనున్నది. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫిబ్రవరి 20 21 22 తేదీలలో ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు రాజేందర్ రెడ్డి తెలిపారు .తమ వ్యవసాయాన్ని నవీకరించుకోవాలి అనే ఆలోచనతో ఉన్న రైతులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఈ షో నిర్వహిస్తున్నామన్నారు . 500కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని అనేక ప్రాంతాల నుంచి లక్ష మంది కి పైగా రైతులు ఈ కార్యక్రమాన్ని సందర్శించే అవకాశం ఉందని అన్నారు .
వివరాలకు 88971 19694.
www.rbagrishow.com