Wednesday 28 February 2024

చిరుధాన్యాల మహారాణి రాయి మతి

 చిరుధాన్యాల మహారాణి



ఒడిశా కోరాపుట్ జిల్లాకు చెందిన రాయి మతి ఘియురియా ను చిరుధాన్యాల మహారాణిగా పిలుస్తారు

ఈ గిరిజన రైతు 72 దేశవాళి ధాన్యం రకాలను 30 చిరుధాన్యాల రకాలను సంరక్షిస్తున్నారు. వీటిలో అరుదైన కుంద్రాబతి మండియా దసరా జువానా జెన్కోలి రకాలు కూడా ఉన్నాయి 16 ఏళ్లకే పెళ్లయిన రాయిమతి చిరుధాన్యాల పట్ల తన ప్రేమను ఏమాత్రం వదులుకోలేదు ఇంటి పనులు చేసుకుంటూనే పొలంలో వివిధ పంటలపై ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు ఏడాది కేడాది మెరుగైన పద్ధతులను అవలంబిస్తూ నాణ్యమైన చిరుధాన్యాలను పండిస్తున్నారు దేశవాళి విత్తనాల పరిరక్షణలో రాయి మతికి 70 ఏళ్ల కమలా పూజారి స్ఫూర్తిగా నిలిచారు పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా ఆయన కమల దగ్గర దేశవాళీ విత్తనాల సంరక్షణ పద్ధతులను ఆకలింపు చేసుకున్నారు ఆమె సూచన మేరకే చెన్నై కేంద్రంగా పనిచేసే ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ లో చేరారు అక్కడ విత్తనాల సంరక్షణలో ఆధునిక పద్ధతులు గ్రామీణ మహిళల ఉపాధి లాంటి అంశాల పట్ల అవగాహన తెచ్చుకున్నారు అందుకే నేను బడిలో ఏం చదువుకున్నానో గుర్తులేదు నాకు తెలిసిందల్లా విత్తనాలను భద్రపరచడం వాటిని పండించడం మాత్రమే సాగుభూమి నా బడి అని నవ్వుతూ చెబుతారు రాయి మతి తనకు తెలిసిన విద్యార్థులతోనే అంతరించిపోకుండా మరింతమందికి చేరువ చేస్తున్నారు చిరుధాన్యాల సాగుపై ఇప్పటివరకు 2500 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు రాయి మతి జీవితం అంటే చిరుధాన్యాలు అన్నంతగా ఆమెకు పేరు తెచ్చింది మీరు వచ్చింది. ఇప్పుడా మీ మహిళా రైతుల సహకార సంఘాన్ని నడుపుతున్నారు చిరుధాన్యాల పిండి వంటలు తయారు చేసే స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారు అంతేకాదు తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని వ్యవసాయ పాఠశాల నిర్మాణం కోసం దానం ఇచ్చారు గత ఏడాది ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో సంప్రదాయ అవార్డులు చిరుధాన్యాల రకాలను ప్రదర్శించే అరుదైన అవకాశం రాయి మతికి దక్కింది ఆమె చొరవకు రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రశంసలు అందాయి జాతీయస్థాయి గుర్తింపు నన్ను మా వాళ్ళ మధ్య గొప్పగా నిలబెట్టింది అంతర్జాతీయ నాయకుల ప్రశంసలకు అర్హురాలిని చేసింది ఈ గుర్తింపు మరిన్ని రకాలను సంరక్షించేలా మన దేశ గౌరవాన్ని మరింత ఇనుమడించేలా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంటారు రాహిమతి