Monday 26 February 2024

ఎలుకలకు చెల్లు చిట్టి

 ఎలుకల నివారణకు అద్భుత చిట్కా కనిపెట్టిన రైతు రాజిరెడ్డి ,దానికోసం ఎగబడుతున్న రైతులు.

ఎలుకల బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు కన్నమ్మ కష్టాలు పడుతుంటారు ఉచ్చులు పెట్టడం పొలం గట్లపై ఉన్న బొరియల నుంచి వాటిని తరిమేయడానికి పొగ పెట్టడం పురుగుమందులను ఉంచడం లాంటివి ఏమి చేసినా ఎలుకల సమస్య రైతులను పట్టిపీడిస్తూనే ఉంటుంది దీనికి విరుగుడుగా ఇప్పుడు ఒక కొత్త పద్ధతిని రైతుల అవలంబిస్తున్నారు. మూడు మీటర్ల ఎత్తులో ఉండే ఒక కర్రకు చిట్టి కట్టి పొలంలో నాటితే చాలు ఇక ఎలుకల బెడద ఉండనే ఉండదట సిద్దిపేట జిల్లాలోని వందలాది రైతులు ఇప్పుడు ఈ ఎలుకల చిట్టి కోసం దీని రూపకర్త రైతువైన రాజిరెడ్డికి దగ్గరికి పరుగులు తీస్తున్నారు ఇది మూఢనమ్మకమే అయినా ఎలుకల బెడద నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న తాపత్రయానికి ఉదాహరణగా నిలుస్తోంది భూంపల్లిలోని నాగారం గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇంటి దగ్గరికి వరి రైతులు బారులు తీరుతున్నారు ఎలుకల చిట్టిల కోసం ఎంత డిమాండ్ ఏర్పడిందంటే ఏకంగా నాలుగు గంటల పాటు క్యూలో నిలబడవలసి వస్తోంది రైతులు తమ పేరు భూమి విస్తీర్ణం గ్రామం పేరు తదితర వివరాలు ఇస్తే ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని సర్వే నంబర్ తో సహా రాసి రాజిరెడ్డి ఇస్తాడు చిట్టి అందుకున్నాక ఎక్కడ ఆగకుండా నేరుగా పొలానికి వెళ్లి చిట్టి కట్టిన కర్రను నాటాలి ప్రతి సీజన్లో ఎలుకల వల్ల 80 నుంచి 90% పంటకు నష్టం వాటిల్ లేదని ఈ చిట్టిని కట్టడం వల్ల ఆ బాధ తప్పిందని నారాయణరావుపేటకు చెందిన రైతు మహంకాళి బిక్షపతి చెత్త తెలిపారు తాను గత ఐదేళ్లుగా ఈ చిట్టిని పొలంలో కడుతున్నానని చెప్పారు ఈ విషయం బాగా ప్రాచుర్యం పొందడంతో సిద్దిపేటతో పాటు పొరుగున ఉన్న రాజన్న సిరిసిల్ల ఇతర జిల్లాల రైతులు కూడా రాజిరెడ్డిని కలవడానికి వస్తున్నారట నిత్యం 100 మందికి పైగా ఈ చిట్టిలను తీసుకొని వెళుతున్నారని చెబుతున్న రాజిరెడ్డి ఒక్కో చిట్టికి 50 నుంచి 100 రూపాయల దాకా వసూలు చేస్తున్నానని తెలిపారు అయితే ఆ చిట్టీలు రాసిన అక్షరాలను ఎవరో చదవలేక పోతున్నారు ప్రాచీన తెలుగు భాషకు సంబంధించినటువంటి అక్షరాలేవో ఉన్నట్లు తెలిసింది