Thursday 29 February 2024

 జూలైలో ఇష్ట శతాబ్ది ఉత్సవాలు అర్జెంటీనా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయము అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్ ఇస్తా శతాబ్ది ఉత్సవాలను జూలై 1 నుంచి 5వ తేదీ వరకు ఇంగ్లాండులో నిర్వహించనున్నట్లు ఇష్టా అధ్యక్షుడు డాక్టర్ కేశవులు తెలిపారు అంతర్జాతీయంగా ఒకే రకమైన విత్తన పరీక్ష ప్రమాణాలను నిర్ణయించడం కోసం 1924లో స్విట్జర్లాండ్ లో ఇస్తా ఆవిర్భవించిందని పేర్కొన్నారు ఈ ఏడాదితో ఈ సంస్థ ఏర్పాటు వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలోనే శతాబ్ది ఉత్సవాల నిర్వహించనున్నట్లు తెలిపారు

Wednesday 28 February 2024

చిరుధాన్యాల మహారాణి రాయి మతి

 చిరుధాన్యాల మహారాణి



ఒడిశా కోరాపుట్ జిల్లాకు చెందిన రాయి మతి ఘియురియా ను చిరుధాన్యాల మహారాణిగా పిలుస్తారు

ఈ గిరిజన రైతు 72 దేశవాళి ధాన్యం రకాలను 30 చిరుధాన్యాల రకాలను సంరక్షిస్తున్నారు. వీటిలో అరుదైన కుంద్రాబతి మండియా దసరా జువానా జెన్కోలి రకాలు కూడా ఉన్నాయి 16 ఏళ్లకే పెళ్లయిన రాయిమతి చిరుధాన్యాల పట్ల తన ప్రేమను ఏమాత్రం వదులుకోలేదు ఇంటి పనులు చేసుకుంటూనే పొలంలో వివిధ పంటలపై ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు ఏడాది కేడాది మెరుగైన పద్ధతులను అవలంబిస్తూ నాణ్యమైన చిరుధాన్యాలను పండిస్తున్నారు దేశవాళి విత్తనాల పరిరక్షణలో రాయి మతికి 70 ఏళ్ల కమలా పూజారి స్ఫూర్తిగా నిలిచారు పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా ఆయన కమల దగ్గర దేశవాళీ విత్తనాల సంరక్షణ పద్ధతులను ఆకలింపు చేసుకున్నారు ఆమె సూచన మేరకే చెన్నై కేంద్రంగా పనిచేసే ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ లో చేరారు అక్కడ విత్తనాల సంరక్షణలో ఆధునిక పద్ధతులు గ్రామీణ మహిళల ఉపాధి లాంటి అంశాల పట్ల అవగాహన తెచ్చుకున్నారు అందుకే నేను బడిలో ఏం చదువుకున్నానో గుర్తులేదు నాకు తెలిసిందల్లా విత్తనాలను భద్రపరచడం వాటిని పండించడం మాత్రమే సాగుభూమి నా బడి అని నవ్వుతూ చెబుతారు రాయి మతి తనకు తెలిసిన విద్యార్థులతోనే అంతరించిపోకుండా మరింతమందికి చేరువ చేస్తున్నారు చిరుధాన్యాల సాగుపై ఇప్పటివరకు 2500 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు రాయి మతి జీవితం అంటే చిరుధాన్యాలు అన్నంతగా ఆమెకు పేరు తెచ్చింది మీరు వచ్చింది. ఇప్పుడా మీ మహిళా రైతుల సహకార సంఘాన్ని నడుపుతున్నారు చిరుధాన్యాల పిండి వంటలు తయారు చేసే స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారు అంతేకాదు తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని వ్యవసాయ పాఠశాల నిర్మాణం కోసం దానం ఇచ్చారు గత ఏడాది ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో సంప్రదాయ అవార్డులు చిరుధాన్యాల రకాలను ప్రదర్శించే అరుదైన అవకాశం రాయి మతికి దక్కింది ఆమె చొరవకు రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రశంసలు అందాయి జాతీయస్థాయి గుర్తింపు నన్ను మా వాళ్ళ మధ్య గొప్పగా నిలబెట్టింది అంతర్జాతీయ నాయకుల ప్రశంసలకు అర్హురాలిని చేసింది ఈ గుర్తింపు మరిన్ని రకాలను సంరక్షించేలా మన దేశ గౌరవాన్ని మరింత ఇనుమడించేలా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంటారు రాహిమతి


Monday 26 February 2024

ఎలుకలకు చెల్లు చిట్టి

 ఎలుకల నివారణకు అద్భుత చిట్కా కనిపెట్టిన రైతు రాజిరెడ్డి ,దానికోసం ఎగబడుతున్న రైతులు.

ఎలుకల బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు కన్నమ్మ కష్టాలు పడుతుంటారు ఉచ్చులు పెట్టడం పొలం గట్లపై ఉన్న బొరియల నుంచి వాటిని తరిమేయడానికి పొగ పెట్టడం పురుగుమందులను ఉంచడం లాంటివి ఏమి చేసినా ఎలుకల సమస్య రైతులను పట్టిపీడిస్తూనే ఉంటుంది దీనికి విరుగుడుగా ఇప్పుడు ఒక కొత్త పద్ధతిని రైతుల అవలంబిస్తున్నారు. మూడు మీటర్ల ఎత్తులో ఉండే ఒక కర్రకు చిట్టి కట్టి పొలంలో నాటితే చాలు ఇక ఎలుకల బెడద ఉండనే ఉండదట సిద్దిపేట జిల్లాలోని వందలాది రైతులు ఇప్పుడు ఈ ఎలుకల చిట్టి కోసం దీని రూపకర్త రైతువైన రాజిరెడ్డికి దగ్గరికి పరుగులు తీస్తున్నారు ఇది మూఢనమ్మకమే అయినా ఎలుకల బెడద నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న తాపత్రయానికి ఉదాహరణగా నిలుస్తోంది భూంపల్లిలోని నాగారం గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇంటి దగ్గరికి వరి రైతులు బారులు తీరుతున్నారు ఎలుకల చిట్టిల కోసం ఎంత డిమాండ్ ఏర్పడిందంటే ఏకంగా నాలుగు గంటల పాటు క్యూలో నిలబడవలసి వస్తోంది రైతులు తమ పేరు భూమి విస్తీర్ణం గ్రామం పేరు తదితర వివరాలు ఇస్తే ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని సర్వే నంబర్ తో సహా రాసి రాజిరెడ్డి ఇస్తాడు చిట్టి అందుకున్నాక ఎక్కడ ఆగకుండా నేరుగా పొలానికి వెళ్లి చిట్టి కట్టిన కర్రను నాటాలి ప్రతి సీజన్లో ఎలుకల వల్ల 80 నుంచి 90% పంటకు నష్టం వాటిల్ లేదని ఈ చిట్టిని కట్టడం వల్ల ఆ బాధ తప్పిందని నారాయణరావుపేటకు చెందిన రైతు మహంకాళి బిక్షపతి చెత్త తెలిపారు తాను గత ఐదేళ్లుగా ఈ చిట్టిని పొలంలో కడుతున్నానని చెప్పారు ఈ విషయం బాగా ప్రాచుర్యం పొందడంతో సిద్దిపేటతో పాటు పొరుగున ఉన్న రాజన్న సిరిసిల్ల ఇతర జిల్లాల రైతులు కూడా రాజిరెడ్డిని కలవడానికి వస్తున్నారట నిత్యం 100 మందికి పైగా ఈ చిట్టిలను తీసుకొని వెళుతున్నారని చెబుతున్న రాజిరెడ్డి ఒక్కో చిట్టికి 50 నుంచి 100 రూపాయల దాకా వసూలు చేస్తున్నానని తెలిపారు అయితే ఆ చిట్టీలు రాసిన అక్షరాలను ఎవరో చదవలేక పోతున్నారు ప్రాచీన తెలుగు భాషకు సంబంధించినటువంటి అక్షరాలేవో ఉన్నట్లు తెలిసింది

వైల్డ్ ఫ్లేవర్స్ తేనె ఉత్పత్తి ఆవిష్కరణ

 సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు అటవీ కళాశాల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారుచేసిన ఆర్గానిక్ సేంద్రియ తేనెను ఆమె సోమవారం ఆవిష్కరించారు రైతులకు తేనెటీగల పెంపకము ఆదాయ అభివృద్ధిపై శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ శివారు ములుగు లో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకము ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పినట్లు చెప్పారు రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు మహిళలకు తేనెటీగల పెంపకం పై వారం రోజుల శిక్షణ కార్యక్రమాలను ఫారెస్ట్ కాలేజీ అందిస్తుందని వెల్లడించారు సేంద్రియ పద్ధతుల్లో అభివృద్ధి చేసిన తేనెను వైల్డ్ ఫ్లేవర్స్ బ్రాండ్ పేరిట ఫారెస్ట్ కాలేజీ అందుబాటులోకి తెస్తున్నదని వివరించారు ములుగు ఫారెస్ట్ కాలేజీలో త్వరలో ఒక తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు డే ని ప్రియాంక వర్గీస్ తెలిపారు కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ పిసిసిఎఫ్ ఆర్ఎం డొబ్రియెల్ గా పిలుస్తున్నారు తదితరులు పాల్గొన్నారు

Friday 23 February 2024

వరి సిరి ఆస్మా అబూబకర్

 కర్ణాటకలోని ముర తన్గాడి కి చెందిన అబుబకర్ హోటల్ వ్యాపారి అతని భార్య ఆస్మా చదువుకుంది ఉద్యోగం చేసేది ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్ళింది భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది తమకున్న చిన్నపాటి కమతంలోని సాగు చేయాలని ఉంది కానీ గ్రామాల్లోని పరిస్థితులు ఆమెను కలవరానికి గురిచేశాయి రైతులు సేద్యానికి దూరమవుతున్న తీరు బాధపెట్టింది మిగిలిన కొద్దిమంది కూడా వాణిజ్య పంటలకే పెద్ద పీట వేస్తున్నారు అది హైబ్రిడ్ విత్తనాలకే ప్రాధాన్యమిస్తున్నారు దీని వలన దేశ వాడి విత్తనాలు కనుమరుగైపోతున్నాయని అర్థమైపోయింది ఆత్మ ఆ పరిస్థితిని తానే ఎందుకు చక్కదిద్దకూడదని అనుకుంది దశాబ్ద కాలంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ అరుదైన దేశవాళి విత్తనాలు సేకరిస్తున్న వాటిలో వరి రకాల ఎక్కువ అంతరించిపోతున్న పంటలు ఆమె చొరవ వల్ల మళ్ళీ జీవం పోసుకున్నాయి ఈ ప్రయత్నంలో శ్రమ ఎక్కువ ఖర్చు ఎక్కువ తన జీవితంలో నుంచి కొంత భాగాన్ని ఎందుకు కేటాయిస్తుంది ఆత్మ ఇప్పటిదాకా తను 840 దేశవాళీ రకాల విత్తనాలను సేకరించింది అందులో 85% విత్తనాలను పంటగా మార్చగలిగిన వాటిని స్థానిక రైతులకు ప్రభుత్వానికి కూడా అందిస్తుంది ఈ ఉద్యమంలో నా భర్త సహకారం మరువలేనిది అని చెబుతున్నది .

Thursday 22 February 2024

రైతుకు టెక్ సాయం

 దుక్కి దున్ని నారు పోసి పంట పండించాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు అంత కష్టపడిన తీరని నష్టాలతో అప్పుల ఊబిలో కూలికిపోయినా అన్నదాతల కథలెన్నో అందుకు ప్రధాన కారణం వారికి సరైన సమాచారం మార్గదర్శనం లేకపోవడమే అంటుంది సాయి గోలే ఐఐటి మద్రాసులో చదివిన ఆమె తన స్నేహితుడితో కలిసి భారత అగ్రి పేరిట వ్యవసాయదారుల కోసం ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చింది సాగుకు సాంకేతికతను జోడించి ఉత్పత్తి పెంచి రైతులు సాధికారతవైపు అడుగులు వేయిస్తుంది

రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిగా నేను తెలుసుకున్నది ఏమిటంటే వ్యవసాయం ఒక సంక్లిష్టమైన శాస్త్రం దానిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు అయితే చిన్నప్పటి నుంచి పంట పొలాల మధ్య పెరిగాను కాబట్టి రైతుల బాధలు వాళ్ళు ఎదుర్కొనే సవాళ్లు సమస్యలపై కొంత అవగాహన ఉంది ముఖ్యంగా అన్నదాతల ఆత్మహత్యలతో మా ఊరి పేరు ఎప్పుడు వార్తల్లోకి ఎక్కేది ఇది నన్ను కలవర పెట్టేది మహారాష్ట్రలోని ఆర్వి గ్రామం మాది నాగపూర్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఊరు చదువుల నిమిత్తం మా కుటుంబం నాగపూర్ కు మారింది ప్రతి శనివారం ఆర్వీలోని మా మామయ్య ఇంటికి వెళుతుండే వాళ్ళం ఆయన వ్యవసాయ క్షేత్రంలో గడిపే వాళ్ళం ఎక్కువగా పత్తి సోయాబీన్ శనగలు పండించేవారు అది అంత లాభసాటిగా ఉండేది కావు కాలేజీలో చదివే రోజుల్లో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలేంటని మా మామయ్యను అడుగుతుండే దాన్ని ఆయన విశ్లేషణలు సమీక్షలు నాకు సంతృప్తి ఇవ్వలేదు

కాలం చెల్లిన పద్ధతులు... మామయ్యతో మాట్లాడిన తర్వాత చదువు లేకపోవడం ఇంకా కాలం చెల్లిన పురాతన వ్యవసాయ పద్ధతుల మీద ఆధారపడడం రైతుల అభివృద్ధికి ఆటంకంగా మారిందని నాకు అర్థమైంది ఇవాళ రేపు ఏ ఇతర రంగం తీసుకున్నా అందులో విద్యావంతులు ఉంటున్నారు కానీ రైతుల విషయం వచ్చేసరికి ఆ సంఖ్య అత్యాల్పం ప్రధానంగా వాతావరణ ప్రభావాలను తట్టుకోగలిగే వ్యవసాయ విధానాలపై వారికి ఉన్న పరిజ్ఞానం పరిమిత. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలంటే అందుకు నేనేం చేయగలను ఐఐటి మద్రాస్ లో చదవడానికి చెన్నై వెళ్ళినప్పుడు కూడా నాకు ఇదే ఆలోచన మా ఊర్లో వ్యవసాయం ఎలా సాగుతుందనేది ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునే దానిని పదేపదే అక్కడ రైతులు వెలిబుచ్చిన ఆందోళన ఏంటంటే ప్రతి సీజన్లో నష్టాలు సరిచూస్తున్నామని వాళ్లు అధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నవారే పంట చేతికి రాకపోతే అప్పుల పాలవుతున్నారు. మరింత ఆందోళనకర అంశం ఏమిటంటే కొందరు తీసుకున్న అప్పు తీర్చలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు దాంతో వారి కుటుంబం దిక్కులేనిది అయిపోతుంది

ఏం చేయాలి... అత్యవసరంగా చేయాల్సింది రైతుకు భరోసా కల్పించడం ఎప్పుడు ఏ పంట వేయాలి? దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎందులో పెడితే నష్టపోతాము ఒకవేళ రుణం తీసుకుంటే వడ్డీలు ఎంత కట్టాలి ఇలాంటి ఎన్నో విషయాల్లో వారికి పూర్తిస్థాయి అవగాహన లేదని నా అధ్యయనంలో తేలింది మా మామయ్య అనే ఉదాహరణగా తీసుకుంటే పత్తి ఎందుకు పండిస్తున్నాము దానికి సమాంతరంగా వేరే పంటలు ఎందుకు వేయడం లేదు తదితర విషయాలపై ఆయనకున్న అవగాహన నామ మాత్రమే ఆధునిక వ్యవసాయం గురించి మొక్కుబడిగా పాఠాలు చెప్పి వదిలేస్తే పరిస్థితులు మార్పు రాదు అందుకే వీటన్నిటిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి మార్గదర్శనం చేసే ఒక వ్యవస్థ కావాలి అంటే ఒక కన్సల్టెన్సీ లాగా స్నేహితుడితో కలిసి ఇదే విషయాన్ని నాతో పాటు ఐఐటీలో చదువుతున్న సిద్ధార్థకు చెప్పాను కావలసినంత పెట్టుబడి పెట్టిన లాభాలు పొందడంలో విఫలమవుతున్న మా కుటుంబాన్ని ఉదాహరణగా చూపించాను దీనిపై అతడు కూడా ఎంతో ఆసక్తి కనపరిచాడు మరింత లోతైన అధ్యయనం చేయాలన్న ఉద్దేశంతో ఎంటెక్లో బయోటెక్నాలజీని సబ్జెక్టుగా ఎంచుకున్నాడు నేను కూడా అదే బాటలో నడిచాను ఇద్దరం కలిసి వ్యవసాయంపై అధ్యయనం చేశాము విలువైన సమాచారం ఎంతో సేకరించాం సాంకేతికతతో సాగును అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పించింది మాస్టర్స్ తర్వాత ఇద్దరం కలిసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఒక ప్రాజెక్టు చేశాను అక్కడ వ్యవసాయ శాస్త్రం నేలసారం మొక్కల రోగ నిర్ధారణ కీటకాలు తదితర ఎన్నో అంశాల గురించి తెలుసుకున్నాము. తర్వాత నేను ఐటీసీలో చేరాను సిద్ధార్థ వ్యవసాయ శాస్త్రంలో మరింత అధ్యయనం కోసం ఇజ్రాయిల్ వెళ్ళాడు సిద్ధార్థ భారత్ కు తిరిగి వచ్చాక నేను నా ఉద్యోగం వదిలేశాను పూనే వెళ్లి ఒక వ్యవసాయ క్షేత్రం తీసుకొని ప్రయోగాలు ప్రారంభించాము రైతుకు సరైన సమయానికి సరైన సమాచారం అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించాం దానికోసం 2017లో భారత్ అగ్రి పేరిట ఫామ్ సొల్యూషన్స్ కంపెనీ ఒకటి బెంగళూరులో ప్రారంభించాం మహారాష్ట్రలోని నారాయణగౌలు ఏడాది పాటు ప్రయోగాత్మకంగా ఉపయోగించాము. సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రమంతటా క్రమంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా సేవలు విస్తరించాము వ్యవసాయానికి సంబంధించి 350 కి పైగా పంటల సమాచారంతోపాటు వాతావరణ పరిస్థితులకు తగిన సూచనలు సలహాలు ఇస్తున్నాము సమస్యలు ఎదురైతే వాటి పరిష్కార మార్గాలు కూడా చూపుతున్నాము వ్యక్తిగతంగా రైతుల కోరిన సేవలను అందిస్తున్నాను. వారి సౌకర్యం కోసం యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చాము మా సేవలు పొందిన రైతులు ఆదాయంలో ఇప్పుడు 40 నుంచి 50% వృద్ధి కనిపిస్తోంది నిథులు సేకరించి ఆర్థిక స్తోమత కలిగిన రైతులకు అండగా నిలుస్తున్నాం 2020 ఫోబ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 30 అండర్ 30లో చోటు తగ్గించుకోవడం గర్వంగా ఉంది రాబోయే రెండేళ్లలో దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు మా కంపెనీని విస్తరించేదుకు ప్రణాళికలు సిద్ధం చేశాము




Tuesday 13 February 2024

13న బయోచార సొసైటీ ఆవిర్భావం

 కట్టెపుల్లల నుంచి పర్యావరణహితమైన భయోచ్చార్ బొగ్గు పొడి ఉత్పత్తిని వాడకాన్ని పెంపొందించే సదుద్దేశంతో భారతీయ బయోచార సొసైటీ ఆవిర్భవిస్తుంది బొగ్గు పొడి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది దీంతో పాటు నీటి శుద్ధి పారిశుద్ధ్యం తదితర అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా బయోచారుకు కార్బన్ క్రెడిట్ చేకూర్చే పరిస్థితులు ఉండటంతో జీవనోపాదులను పెంపొందించడానికి కూడా ఇది దోహదపడనుంది ఈ నెల 13వ తేదీన సాయంత్రం ఐదు ఏడూ గంటల మధ్య హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని ఎన్ ఐ ఎం ఎస్ ఎం ఈ కార్యాలయ ఆవరణలో బయోచ్చార్ సొసైటీ ఆవిర్భావ సభ జరగనుంది ఆర్కే మిగతా చైర్మన్గా డాక్టర్ నక్క సాయి భాస్కర్ రెడ్డి ప్రెసిడెంట్గా ఎస్కే గుప్తా కార్యదర్శిగా భారతీయ బయోచార సొసైటీ ఆవిర్భవిస్తుంది వివరాలకు 6 3 0 5 1 7 1 3 6 2

ఎక్కడి నుంచైనా మోటార్ ఆన్ ఆఫ్

 రైతులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బంది ఓ స్టార్ టాప్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం ద్వారా ఫోన్ తో బోర్ మోటార్ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తోపాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో తయారైన ఎంబిటెడ్ స్టార్టర్ ఇది దొంగల భయం లేని ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న రైతులు

నాగర్ర్తి తిరుపతి రెడ్డి గారు మాచాపూర్ చిన్నకోడూరు మండలం సిద్దిపేట జిల్లా వాస్తవ్యులు 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తూ పొలానికి సుమారుగా 600 మీటర్ల దూరం నుంచి సాగునీరు సరఫరా చేస్తున్నారు దూరంలో బోరు ఉండటంతో పైపులు చాలా సార్లు ఊడిపోతుండేవి అప్పుడు మోటార్ను బందు చేసేందుకు అంత దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారానే మోటార్ను ఆన్ ఆఫ్ చేస్తున్నారు సెల్ ఫోన్తో బోర్ మోటార్ ఆఫ్ ఆన్ చేయడం అందుబాటులోకి రావడంతో చాలా ఇబ్బందులు తప్పాయి ఈ పరికరం లేకపోతే నేను వ్యవసాయం కూడా చేయకపోతే అంటున్నారు

పంపరి సత్తయ్య చిన్నకోడూరు చిన్నకోడూరు మండలం సిద్దిపేట జిల్లా వాస్తవ్యులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బందులు ఉండేవి పక్కన రైతును బతిమిలాడుకునే వాళ్ళము అదే ఇప్పుడు న్యాస్తా స్టార్టర్ తో ఎక్కడికైనా ఫంక్షన్కు ఊరికి సంతోషంగా వెళ్లి వస్తున్నా అక్కడి నుంచే మోటార్ను సెల్ఫోన్లో నుంచి ఆన్ ఆఫ్ చేస్తున్నా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది అంటున్నారు

వరి మొక్కజొన్న మిర్చి ఇలా సాగు పంట ఏదైనా సమయానికి సాగునీటిని అందించడం ముఖ్య విషయం స్వయంగా పొలానికి వెళ్లి మోటారు ఆఫ్ చేయడం సాధారణంగా రైతు చేసే పని అయితే ఏదైనా పనిమీద రైతు ఊరికి వెళ్లాల్సి వస్తే పక్క పొలంలో రైతును బతిమాలుకొని పంటలకు నీళ్లు పెట్టేందుకు మోటార్ ఆన్ ఆఫ్ చేయించేవారు ఇప్పుడు అలా ఎవరిని ఇబ్బంది పెట్టక్కర్లేదు రైతు ఇబ్బంది పడనక్కర్లేదు ఎందుకంటే రైతు ఎంత దూర ప్రాంతం వెళ్లిన సరే ఫోన్ నెట్వర్క్ ఉంటే చాలు మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పుడంటే అప్పుడు బోర్ మోటార్ను ఆన్ చేసుకోవచ్చు పని పూర్తయ్యాక ఆఫ్ చేసుకోవచ్చు నేస్త అనే స్టార్టప్ కంపెనీ వారు అత్యధిక సాంకేతికతతో విలక్షణ స్టార్టర్ ను అందుబాటులోకి తెచ్చారు

సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో పలువురు రైతులు దీని వినియోగిస్తున్నారు ఈ పరికరాన్ని 16 వద్దా మార్చుకోవడం వలన ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా మోటార్ను ఆన్ చేసుకునే వెసులుబాటు ఏర్పడటంతో తమకు చాలా ఇబ్బందులు తప్పంటున్నారు రైతులు నలుగురు యువ విద్యావంతులు స్థాపించిన న్యాస్త స్టార్టప్ కంపెనీ రాజేంద్రనగర్ లోని జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థ ఏ ఐడియాలో ఇంక్వేషన్స్ సేవలు పొంది రూపొందించిన ఈ పరికరంలో మొబైల్ లో మాదిరిగానే ఒక సిమ్ కార్డు ఉంటుంది దాని ద్వారా మెసేజ్ రూపంలో పొలంలో నీటి మోటార్ కు సంబంధించిన సమాచారం అంటే మోటార్కు నీరు సరిగా అందుతుందా విద్యుత్తు ఓల్డ్ పేజీ ఎంత ఉంది మోటార్నీటినీ సరిగ్గా ఎత్తిపోస్తోందా లేదా వంటి సమాచారం ఎప్పటికప్పుడు రైతు మొబైల్ కు మెసేజ్లు వస్తాయి సంవత్సరానికి ఒక్కసారి ఈ సింకు రీఛార్జ్ చేస్తే సరిపోతుంది ఫోన్ సిగ్నల్స్ ఉండే ఎక్కడి నుంచైనా మోటార్ను ఆన్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది నీరు లేకపోయినా విద్యుత్ హెచ్చుతగ్గులు వచ్చిన మోటార్ స్విచ్ ఆఫ్ అయిపోయి రైతుకు మొబైల్ లో సందేశం వస్తుంది

ఉపయోగాలు ఎన్నెన్నో ఎప్పుడు కావాలంటే అప్పుడు న్యాస్తా మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు. ఏ ఏ వేళల్లో మోటార్ నడవాలి ఇంటర్వెల్స్ మోడ్ భూగర్భంలో నీరు తక్కువగా ఉన్నచోట నిరంతరంగా బోర్లు నడిపితే కాలిపోతాయి విద్యుత్తు ప్రసారం ఉండే సమయాలకు అనుగుణంగా మోటార్ను ఏ సమయానికి ఆన్ చేయాలి. ఏ సమయానికి ఆఫ్ చేయాలి అని టైం సెట్ చేస్తే చాలు ఆ ప్రకారంగా అదే ఆన్ అవుతుంది. అదే ఆఫ్ అవుతుంది. షెడ్యూల్ ఆర్ మోడ్ ప్రతిరోజు ఒకే సమయంలో ఆన్ అయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా టైం ఫిక్స్ చేసుకోవడం వలన ప్రతిరోజు పంటలకు సాగునీళ్లు తగిన మోతాదులు అందించే అవకాశం ఉంటుంది దొంగల భయం లేదు వరి కూరగాయలు పామాయిల్ మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్న ఒక వంద 17 మంది రైతులు ఈ స్టార్టప్ ద్వారా లబ్ధి పొందుతున్నారని న్యాస్త స్టార్టప్ సహా వ్యవస్థాపకులు భార్గవి 8367369514  తెలిపారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తోపాటు క్లౌడ్ బేస్ టెక్నాలజీతో ఈ అంబాటెడ్ స్టార్టర్ పనిచేస్తుంది అందువల్ల పొలంలో నుంచి ఎవరైనా ఇతరులు దీన్ని దొంగతనంగా తీసుకెళ్లిన వారి వినియోగించలేరని దాన్ని ఆన్ చేయగానే మొబైల్ నెట్వర్క్ ద్వారా దాని లొకేషన్ ఇస్తే తెలిసిపోతుందని ఆమె సాక్షికి తెలిపారు ఓవర్ ద ఎయిర్ సర్వర్ ద్వారా ఈ స్టార్టర్ లను తాము నిరంతరం పర్యవేక్షం పర్యవేక్షిస్తూ ఉంటామని సాంకేతికంగా అప్డేట్ చేయడం చాలా సులభమని అన్నారు రైతు ఒక్క సిమ్ ద్వారా అనేక మోటార్లను వాడుకోవడం ఇందులో ప్రత్యేకత అని ఆమె వివరించారు





Friday 9 February 2024

బీమా లకు సారథి ఫసల్ బీమా ఫిర్యాదులకు కృషి రక్షక్

 ప్రత్యేక పోర్టల్లను ప్రారంభించిన కేంద్రం.. గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయదారులకు ఫసల్ బీమా సహా ఇతర బీమా సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సారథి అనే పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా గురువారం ప్రారంభించిన ఈ పోర్టల్ లో బీమా పాలసీల కొనుగోలు ప్రీమియం చెల్లింపులు వంటివన్నీ సేవలను పొందవచ్చు అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారానికి కృషి రక్ష పోర్టల్ 14447 హెల్ప్ లైన్ నెంబర్ ను ప్రారంభించారు దీంతో పాటు ఫసల్ బీమా కిసాన్ క్రెడిట్ కార్డు ఎంఐఐఎస్ పథకాలపై మరింత అవగాహన కల్పించేందుకు కావలసిన సమాచారాన్ని కూడా వ్యవసాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది..

Friday 2 February 2024

వ్యవసాయ రంగానికి అగ్రి షో తో మేలు

 అగ్రి షో కిసాన్ 2024 ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయ యాంత్రీకరణలో కీలక భూమిక పోషిస్తున్న కంపెనీలు నిపుణులు ప్రగతిశీల రైతులు మరిన్ని ఆలోచనలకు ఈ వినూత్న కార్యక్రమం మరింత పదం పెడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు వ్యవసాయరంగా అభివృద్ధికి కృషి చేస్తున్న విభిన్న వాటాదారులను ఒకచోటకు చేర్చే అగ్రిషో కిసాన్ 2024 కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల గురువారం హైటెక్స్ లో ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ ఇలాంటి అగ్రిశువుల వల్ల వ్యవసాయ రంగం మరింత ముందుకు సాగుతుందని అన్నారు అగ్రి షో ఈనెల మూడవ తేదీ వరకు కొనసాగానుంది దీనిలో వ్యవసాయ యంత్రాలు నూతనంగా రూపొందించిన పనిముట్లు ట్రాక్టర్లు, వాటర్ ఇరిగేషన్ సొల్యూషన్స్ వివిధ రకాల పనిముట్లు వినూత్న ఆవిష్కరణలు అంకుర సంస్థలు కాంట్ రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్ సహా విస్తృతమైన ఉత్పత్తులు సేవలను ప్రదర్శిస్తారు కాగా మొక్కలను పెంచడం అంటే భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమేనని మంత్రి అన్నారు గురువారం నగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హార్టికల్చర్ అగ్రికల్చర్ ప్రదర్శనను మంత్రి తుమ్మల ప్రారంభించారు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం ప్రేమికులు ఎంతోమంది ఉన్నారని ఇండ్లు టెర్రస్ బాల్కనీలో మొక్కలు పెంచుకునే ఆసక్తి ఉన్నవారికి ఈ మేళాతో ఎంతో ఉపయోగమని అన్నారు.