Friday 1 March 2024

లక్షాధికారులను చేసిన పువ్వులు

ఊరి పేరే పూలపల్లి

సీజన్తో నిమిత్తం లేకుండా కనిపించినంతమేరా పూల తివాచీ పరిచినట్లు బంతులు చేమంతుల తోటలని చూడాలనుకుంటే మహారాష్ట్రలోని పొలాంచ గ్రామానికి వెళ్లాలి అవును నికం వాడి అన్న ఆ ఊరి అసలు పేరు చెబితే ఎవరికీ తెలియదు. పూలంచ అంటేనే తెలుస్తుంది మరి. అక్కడి నుంచి రోజు ట్రక్కులకు ది పువ్వులు నగరాలకు రవాణా అవుతుంటాయి ఈ పల్లెలో కొంతకాలం క్రితం వరకు రైతులు పసుపు చెరకు పండించేవారు నీళ్లు ఉంటే పంట లేకపోతే లేదు ఎంత కష్టపడినా వచ్చే ఆదాయంతో పూట గడవడం కష్టంగా ఉండేది వెంట పడగా పడగా పంట అమ్మిన ఏడాదికి కానీ డబ్బు ఇచ్చేవారు కాదు అలాంటిది 2005లో ఒక వ్యవసాయ అధికారి సలహాతో నలుగురైదుగురు రైతులు ధైర్యం చేసి కొంత పొలంలో బంతిపూల సాగు చేపట్టారు తక్కువ సమయంలోనే వారి చేతికి డబ్బు అందడం చూసి మిగిలిన రైతులు ఆకర్షితులయ్యారు. క్రమంగా 170 మంది చిన్న రైతులు 200 ఎకరాలలో పూల సాగు చేపట్టారు బంతిపూలతో పాటు 8 రంగుల చేమంతులను పండిస్తూ రోజు 12 టన్నుల పూలను రక్కులలో నగరంలోని మార్కెట్ కి పంపుతున్నారు బంతి ఏడాది పొడుగునా పూస్తుంది కానీ చేయమంతులు మాత్రం కొన్నాళ్లే పూస్తాయి అయితేనే జీవితంలో మొదటిసారి లక్షలలో ఆదాయాన్ని కళ్ళ చూడగలుగుతున్నామంటే అది ఈ పూల చలవే అంటున్నారు. పూలంచవాసులు పువ్వులు లేని వేడుకలు ఉండవు కాబట్టి ఆదాయానికి ఢోకాలేదు ఈ ఊరి వాళ్లే పూల మొక్కల నర్సరీ కూడా నిర్వహిస్తూ చుట్టుపక్కల రైతులకు పూలతోటలు పెంచుకోవడానికి సహాయం చేస్తున్నారు




 రలాబా రజనగంధ

ఒడిశాలోని సముద్రతీర ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రలాబా గ్రామము సరిగ్గా పాతికల క్రితం వచ్చిన సూపర్ సైక్లోన్ ఆ ఊరిని అతలాకుతలం చేసింది 250 కిలోమీటర్ల వేగంతో పిలిచిన గాలులకు అక్కడే ప్రజల జీవనాధారమైన తమలపాకు తోటలు పోక చెట్లు నేలకూరిగాయి జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి వారికి చాలా సమయం పట్టింది తుఫాను గండం ఎప్పుడూ పొంచి ఉండేదే కాబట్టి పంటలను మార్చడమే మార్గం అనుకున్న రైతులు రజనీగంధ పూల సాగు వైపు మల్లేరు మొదట్లో 30 మంది 10 ఎకరాలలో ప్రారంభించగా ఇప్పుడు గ్రామంలోని 140 మంది రైతులు పూల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈసాగే చేస్తూ ఊరిని తమ జీవితాల్ని పరిమళభరితం చేసుకున్నారు వీటి వల్ల భూమిలేని వారికి కూడా చేతినిండా పని దొరికింది రోజు పువ్వులు కోయడం ప్యాక్ చేయడం నగరాలలోని పుష్పగుచ్చాల తయారీదారులకు సరఫరా చేయడం లాంటి పనులు చేస్తూ వారు ఉపాధి పొందుతున్నారు మొక్కలు నాటిన ఎనిమిది నెలలకు పూత ప్రారంభమవుతుంది ఇక అప్పటినుంచి ఎకరానికి ఏటా రెండున్నర లక్షల ఆదాయం గ్యారెంటీ చేయాల్సిందల్లా వారానికోసారి నీళ్లు పెట్టడమే అంటున్నారు రలాబా వాసులు




ఒకటి తుఫానులతో కొట్టుమిట్టాడే ప్రాంతం మరొకటి కరువు బారిన పడిన ప్రాంతం ఇంకొకటి వ్యాపార పంటల నీళ్లు దాహం తీర్చలేక అల్లాడుతున్న ప్రాంతం ఈ మూడింటి తలరాతని మార్చేసి ఒకనాటి పేద రైతులను నేడు లక్షాధికారులను చేస్తుంది పువ్వుల సాగు

ఏటా వాలంటైన్స్ డే నాడు ఆస్ట్రేలియా జపాన్ దుబాయ్ సింగపూర్ మలేషియా ఇలాంటి పలు దేశాలలో అమ్ముడు అవుతున్న ఎర్ర గులాబీలు ఎక్కడివో తెలుసా మనదేశంలోని పశ్చిమ కనుమలలో పూసినవి పూణే జిల్లాలో ఉన్న మావల్ గ్రామంలో ఒకప్పుడు వారి చెరకు ప్రధాన పంటలు రాను రాను ఆ పంటల నీటి దాహాన్ని తీర్చడం రైతుల వల్ల కాలేదు ప్రత్యామ్నాయాల వైపు దృష్టిసారించిన వాళ్లను గులాబీలు ఆకట్టుకున్నాయి 90వ దశకంలో టాటా సంస్థ ఓరియంటల్ ఫ్లోరా టెక్ని ప్రారంభించి డచ్ రోజెస్ని సాగు చేసేది ఆ తర్వాత కొన్ని సంస్థలు కూడా ఈ ప్రయోగం చేశాయి కానీ అదంతా కార్పొరేట్ కంపెనీల వ్యవహారం అనుకున్న రైతులు చాలా కాలం అటువైపు చూడలేదు అలాంటిది గత దశాబ్దంలో ఒక్కొక్కరుగా మొదలుపెట్టి ఇప్పుడు పలువురు రైతులు ఈ బాట పట్టారు బాబు ఎకరంతో మొదలుపెట్టి 15 ఎకరాల వరకు పొలం ఉన్నవాళ్లు కూడా గులాబీ ఉత్పత్తిదారుల సంఘాలలో చేరి రంగురంగుల పువ్వుల్ని సాగు చేస్తున్నారు రోజు టన్నులకొద్దీ గులాబీలను దేశ విదేశీ మార్కెట్లకు పంపుతూ లక్షలలో సంపాదిస్తున్నారు పాలి హౌస్లలో బిందు సేద్యని అనుసరించడం వల్ల నీటికి సమస్య లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు గులాబీల సేద్యం వైపు వెళ్లడం విశేషం ఎకరం పొలం ఉన్న చాలు రోజుకు కనీసం రెండు వేల పువ్వులు వస్తాయని పూల సాగు చేపట్టాక మిగులు ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నామని చెబుతున్నారు ఇక్కడి రైతుల