Tuesday, 5 March 2024

ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం

 మా మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో నాలుగు జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం పప్పులు తదితర ఉత్పత్తులను అవని ఆర్గానిక్స్ పేరుతో విశాఖ నగరంలోని నాలుగు రైతు బజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికీ కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతుంది ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోని ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచనను ప్రోత్సహించిన ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్లు ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు బాక్ చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం స్థలంతో పాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది వైర్ ఫెన్సింగ్ డ్రిప్పులు సిబ్బంది జీతాలను మా ఎఫ్ బి ఓ సమకూర్చుతోంది నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటి పంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ళవచ్చు స్కూలు విద్యార్థులకు ఇంటి పంటలు ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశం అని మేం భావిస్తున్నాం యూనివర్సిటీలో ఈ పంటలను రెండు ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది

ఉషా రాజు ఏయూ అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెన్ హబ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం