27, నవంబర్ 2026, శుక్రవారం

అచ్చంపేట లో తూర్పు పొడ పశు జాతి, దక్కనీ గొర్రెల పరిశోధన కేంద్రాలు

 దేశవ్యాప్తంగా పేరు పొందిన తెలంగాణ దేశీయ పశువుల జాతి తూర్పు పొడ, గొర్రెలలో దక్కని జాతి పరిశోధన కేంద్రాలను 20 కోట్ల 31 లక్షల రూపాయలతో మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో 100 ఎకరాలలో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. శారీరక దృఢత్వం, సామర్థ్యం గల తూర్పు పొడ పశుజాతి నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి చెందినది. జాతీయ జన్య వనరుల సంస్థ/ నేషనల్ బ్యూరో ఆఫ్ అనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ ద్వారా జాతీయ గుర్తింపు పొందిన తెలంగాణ మొదటి పశువుల జాతి ఇది. ఇప్పటికీ ఐదు మండలాల్లో 500 కుటుంబాలు ఈ పశువులను పెంచుతున్నాయి. మరొకవైపు మహబూబ్నగర్ జిల్లాలో నలుపు, ముదురు గోధుమ రంగులో బలిష్టంగా ఉంటూ నాణ్యమైన మాంసం, ఉన్నితో వ్యాధులను తట్టుకోగల దక్కని గొర్రెలు విశిష్టమైనదిగా పేరుపొందాయి .క్రమేపీ వీటి సంతతి తగ్గుతున్న నేపథ్యంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం వీటి పరిరక్షణకు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE