20, నవంబర్ 2026, శుక్రవారం

ముల్కనూర్ సహకార సంఘం.. జాతీయ పురస్కారం

 కరీంనగర్ జిల్లా ముల్కనూర్ సహకార సంఘానికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది .రైతులకు 70 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించినందుకు గాను జాతీయస్థాయిలో ఈ గుర్తింపు లభించింది. ఉత్తమ సంస్థలను గుర్తించి సత్కరించే ఇండియన్ కో-ఆపరేటివ్ సబ్మిట్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమంలో రైతులకు విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను ముల్కనూరు సహకార సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ కో-ఆపరేటివ్ ఎడిటర్ అజయ్ ఝా ,ఎన్ ఏ ఎఫ్ సి యు బి చైర్మన్ లక్ష్మీ దాస్, సహకార ఎన్నికల అథారిటీ చైర్పర్సన్ బి కే సింగ్, ఇఫ్కో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యు ఎస్ అవస్తి ,నాబార్డ్ మాజీ డైరెక్టర్ సతీష్ మరాఠీ చేతుల మీదుగా ప్రవీణ్ రెడ్డి ఈ అవార్డును స్వీకరించారు. ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ముల్కనూర్ సహకార సంఘానికి జాతీయస్థాయిలో అవార్డు లభించడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు .రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి, అధునాతన కార్యక్రమాలు చేపట్టి వీటి అమలును త్వరలో ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. రైతుల విశ్వాసాన్ని, సహకార విలువలను, రైతులకు భవిష్యత్తులో సేవలను అందించిన సంఘ ప్రస్థానంలో ఈ పురస్కారం ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. 

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE