25, నవంబర్ 2026, బుధవారం

పొలం గట్ల మీద కందులు

 పప్పు ధాన్యాల సాగులో ఆదర్శంగా సుధ్వార్ గ్రామ రైతులు.. 28,150 హెక్టార్లలో సాగు.. దాల్ వాలా గావ్ గా పేరు..

వరి సాగు తోనే సరి పెట్టకుండా అదే పొలంలోనే మరో పంటను కూడా పండిస్తూ అదనపు దిగుబడి ని సాధిస్తున్నారు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని షహ్ డోల్ జిల్లాలోని సుధ్వార్ గ్రామానికి చెందిన రైతులు.నిరుపయోగముగా ఉన్న పొలం గట్లనే సాగు భూములుగా మార్చేశారు. వరితో పాటు కందులు పండిస్తూ కుటుంబానికి సరిపడా పప్పు ధాన్యాల ను సమ కూర్చుంటున్నారు. ఈ సరికొత్త ప్రయత్నం తో ఆ గిరిజన గ్రామం ఇప్పుడు ఇతర ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.

గోహ్ పారు బ్లాక్ లోని ఈ గిరిజన గ్రామం " పప్పు ధాన్యాల గ్రామం " గా పేరు పొందింది.రెండెకరాల్లో వరి సాగు చేస్తున్న రైతు సంతోష్ సింగ్ పొలం గట్ల పై కందులు పండిస్తూ అదనంగా 130 నుండి 150 కిలోల దిగుబడి పొందుతున్నారు.ఇంకో రైతు హరి దిన్ సింగ్ ఎకరా పొలంలో 60 నుండి 80 కిలోల కందులు పండిస్తున్నారు.

వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో గతంలో నిరుపయోగంగా ఉన్న గట్లు వాడుకలోకి వచ్చాయి.ఈ విధానం ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. చిన్న కమతాలు ఉన్న రైతులు సైతం కుటుంబ అవసరాలకు సరిపడా పప్పు ధాన్యాల ను పండించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. షహ్ డోల్ జిల్లాలో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 2025 ఖరీఫ్ లో 27,500 హెక్టార్లు ఉండగా ,2026 లో 28,150 హెక్టార్లకు పెరిగింది. కందుల సాగు 14,000 నుండి 14,350 హెక్టార్లకు పెరిగింది . రబీ సీజన్లో నూ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని పెంచారు.తక్కువ భూమిలోనే అదనపు పంట సాధ్యమని సుధ్వార్ రైతులు నిరూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE