8, నవంబర్ 2026, ఆదివారం

శ్రీ ఎర్రబెల్లి రామ్ మోహన్ రావు గారు, వరంగల్

 వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కళ్యాణ గ్రామానికి చెందిన శ్రీ ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారికి ప్రకృతి ఎంతో మమకారం. తొమ్మిది ఎకరాల స్థలం లో చెట్టులు నాటి పచ్చని వనాన్ని సృష్టించారు. చుట్టూ ఉన్న కొండల నడుమ చెరువు తవ్వించి వర్షపు నీటిని ఒడిసిపడుతున్నారు .ఫలితం గా చెరువు పరిసరాల్లోనే రైతుల బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి .దాంతో వారు నీటి సమస్యను అధిగమించి పంటలను పండించుకుంటున్నారు .అంతేకాదు అక్కడికి వచ్చే పక్షుల ఆహారం గురించి ఆలోచించిన రామ్మోహన్ రావు గారు చెరువులో చేపలను కూడా పెంచుతున్నారు .పక్షులు, జంతువులు, సమస్త జీవజాలంతో ఆ ప్రాంతం ప్రకృతి రమణీయ ప్రాంతంగా మారి పోయింది. ఇవే కాకుండా గ్రామ పరిధిలో సొంతంగా నాలుగు కుంటలను తవ్వించి లక్షల మొక్కలను నాటడం ఆ ప్రాంతం పచ్చగా మారిపోయింది. 

చదువుకున్న యువత సమాజానికి ఆదర్శం

 ప్రస్తుత కాలంలో యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా వ్యవసాయ రంగంలోనూ నూతన అవకాశాలు అన్వేషిస్తూ ముందుకు సాగుతోంది . ఇందుకు నిదర్శనం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల ప్రస్థానం ఇలా కొనసాగింది. గ్రామానికి చెందిన జంగబోయిన రామచంద్రం, బుడ్డా ఆంజనేయులు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు మష్రూమ్/ పుట్టగొడుగుల సాగును చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. రామచంద్రము ఒక ప్రముఖ బహుళ జాతి సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మల్లు పల్లి గ్రామ శివారులో గల తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పుట్టగొడుగుల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఆయన చిన్ననాటి స్నేహితుడు బుడ్డా ఆంజనేయులు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి ఎంకాం పూర్తి చేశారు. వ్యవసాయ రంగంపై ఆసక్తితో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లో మష్రూమ్ సాగుపై ప్రత్యేక శిక్షణ పొందారు. శాస్త్రీయ పద్ధతుల్లో మష్రూమ్ సాగు చేయడం, ఉత్పత్తి నాణ్యతను పెంచడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకున్నారు. ఇద్దరు స్నేహితులు తమ విద్య, వృత్తి అనుభవం, వ్యవసాయంపై ఉన్న ఆసక్తిని కలిపి గ్రామంలో ఉన్న జంగబోయిన రామచంద్రం వ్యవసాయ క్షేత్రంలో మష్రూమ్స్ సాగుకు శ్రీకారం చుట్టి అభివృద్ధి చేస్తున్నారు. సరైన శిక్షణ, శాస్త్రీయ పద్ధతులతో మంచి ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వారు తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న యువత, గ్రామీణ నిరుద్యోగులు, రైతులు వ్యవసాయాన్ని ఒక ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా పరిగణించాలని వారు సూచిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారికి మష్రూమ్ సాగుపై అవగాహన కల్పిస్తూ ఈ రంగంలో మరింత మందిని ప్రోత్సహించాలని ఆలోచనతో ఉన్నారు. ఎవరైనా మష్రూమ్ సాగుపై ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని వారు తెలిపారు.ప్రస్తుతం తాము సాగు  చేసిన మష్రూమ్ 2 క్వింటాళ్ల వరకు వచ్చిందన్నారు. దీని విలువ మార్కెట్లో కిలో 650 రూపాయలు ఉంటుందని చెప్పారు. ఉద్యోగాలు చేస్తూ వ్యవసాయంపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుకుంటున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. 

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE