21, నవంబర్ 2026, శనివారం

చక్కెరకు బదులుగా స్టీవియాతో

 చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే స్టీవియా పంట సాగుతో రైతులు అధికంగా ఆదాయం పొందే అవకాశం ఉందని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ శ్రీ దండ రాజిరెడ్డి గారు తెలిపారు. స్టీవియా ను ఆయిల్ ఫామ్ ,మామిడి, బత్తాయి వంటి తోటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు అన్నారు. రైతులకు నాణ్యమైన మొక్కలు అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్టీవియా మొక్కల నర్సరీ ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. శ్రీ కొండా లక్ష్మణ్  ఉద్యాన విశ్వవిద్యాలయం, రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ సొసైటీ, గ్లోబల్ స్టీవియా ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులో తొలిసారిగా స్టీవియా పై జాతీయ సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజిరెడ్డి గారు మాట్లాడుతూ స్టీవియా సాగులో శాస్త్రీయ పురోగతి, మెరుగైన సాగు పద్ధతులు, మార్కెటింగ్ అనుసంధానం పై రైతులకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం అని వివరించారు. సాధారణంగా 25 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుందని, తెలంగాణ వాతావరణ పరిస్థితులు ఈ పంట సాగుకు అనువుగా ఉన్నాయని తెలిపారు. ఈ పంట డయాబెటిస్, రక్తపోటు ,ఊబకాయం, ఎసిడిటీ ,దంతాలకు, చర్మ సంబంధ వ్యాధులకు ,క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విసి తో పాటు జే చినా ,సురేష్ కుమార్, ప్రశాంత్,  విజయకాదర్ ,మంజునాథ్, జస్టిస్ వామన రావు ,ఏపీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రాజేంద్ర కుమార్, నందా ,ఈశ్వరరెడ్డి , వెంకు ,వరల్డ్ బ్యాంకు ఎఫ్ఏఓ ఎన్బికె ప్రశాంతి ,రైతులు పాల్గొన్నారు. 

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE