25, నవంబర్ 2026, బుధవారం

శతావరి సాగు ద్వారా మెరుగైన ఆరోగ్యం..

 ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యం ఉన్న శతావరి మొక్కల సాగును ప్రోత్సహించేందుకు ఉస్మానియా విశ్వ విద్యాలయం వృక్ష శాస్త్ర విభాగం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ ఆర్థిక సహాయం తో "శతావరి సాగు ద్వారా మెరుగైన ఆరోగ్యం"అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారు. ఇందులో భాగంగా లక్ష శతావరి మొక్కల తో నర్సరీ ని ఏర్పాటు చేసి రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ ఇ. సుజాత ఈ ప్రాజెక్టు ను సమన్వయం చేస్తున్నారు. రైతులకు అవగాహన కల్పించడం తో పాటు ఔషధ మొక్కల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించేందుకు పలు కార్యక్రమాలు రూపొందించారు. డిసెంబర్ 14,15 తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఔషధ మొక్కల రాణి.. శతావరి.. 

శతావరి ని ఆయుర్వేదంలో ఔషధ మొక్కల రాణి గా పిలుస్తారు. తీగల మాదిరిగా పెరిగే ఈ మొక్క భూమిలో పొడవైన , కండ గల వేర్లను ఏర్పరుస్తుంది. ఔషధ తయారీలో ప్రధానంగా ఈ వేర్లనే వినియోగిస్తారు. ఎకరాకు సుమారు 11,200 మొక్కలను నాటవచ్చు. సాధారణంగా 18 నుంచి 24 నెలల తర్వాత వేర్లను సేకరించవచ్చు. వాటిని నాణ్యత ఆధారంగా వేరు చేసి అమ్మకానికి సిద్ధం చేయాలి. ఎకరాకు 3 నుంచి 5 టన్నుల వరకు పచ్చి వేర్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఎండిన వేర్ల ధర కిలోకు సుమారు 300 రూపాయల నుంచి 750 రూపాయల వరకు ఉండవచ్చని అంచనా.. 

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE