20, నవంబర్ 2026, శుక్రవారం

వైరస్ ల నుంచి రక్షణ

 మొక్కలు వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి తమను తాము ఎలా రక్షించుకుంటాయి అనే కీలక విషయాన్ని హైదరాబాదులోని సీసీఎంబి శాస్త్రవేత్తలు వెల్లడించారు. ద్రవ రూపంలో ఉండే జిగురు వంటి ప్రోటీన్ బిందువులను ఉపయోగించి వైరస్లను బంధించి నిర్వీర్యం చేస్తాయని వీరి పరిశోధనలో తేలింది. డాక్టర్ మందార వి దేశ్ ముఖ్ నేతృత్వంలోని బృందం చేసిన ఈ పరిశోధన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కెమికల్స్ సొసైటీలో ప్రచురితమయ్యాయి. వైరస్ సోకినప్పుడు మొక్కలు కొన్ని రకాల ఆర్ ఎన్ ఏ బైండింగ్ ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి వైరస్ జన్యు యంత్రాంగాన్ని బంధించి వైరస్ విభజన చెందకుండా అడ్డుకుంటాయి. సిసిఎంబి పరిశోధకులు ఆధునిక న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రీజనెన్స్ స్పెక్ట్రోస్కోపీ, ఫ్లోరోసిన్స్ మైక్రోస్కోపీ మాలిక్యులర్ డైనమిక్స్ సిమ్యులేషన్స్ పద్ధతులను ఉపయోగించి ఈ ప్రోటీన్లు వైరల్ ఆర్ ఎన్ ఏ ను ఎలా బంధిస్తాయో గుర్తించారు. 

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE