2, మార్చి 2024, శనివారం

రైతులకు ప్రత్యేక శిక్షణ

 జాతీయ పురుగు తెగులు నిఘా సంస్థకు చెందిన మొబైల్ యాప్ పై భిక్కనూరు రైతు వేదికలు రైతులకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్ జీడిమెట్ల లోని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారి సునీత ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పదిమంది ఆదర్శ రైతులకు యాప్ వినియోగము పనితీరు ఉపయోగాలను వివరించారు సహాయ సస్యరక్షణ అధికారులు నీలా రాణి రవిశంకర్ శ్వేతా సుధా రైతులు సంతోష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాజిరెడ్డి నరేష్ స్వామి పాల్గొన్నారు



1, మార్చి 2024, శుక్రవారం

లక్షాధికారులను చేసిన పువ్వులు

ఊరి పేరే పూలపల్లి

సీజన్తో నిమిత్తం లేకుండా కనిపించినంతమేరా పూల తివాచీ పరిచినట్లు బంతులు చేమంతుల తోటలని చూడాలనుకుంటే మహారాష్ట్రలోని పొలాంచ గ్రామానికి వెళ్లాలి అవును నికం వాడి అన్న ఆ ఊరి అసలు పేరు చెబితే ఎవరికీ తెలియదు. పూలంచ అంటేనే తెలుస్తుంది మరి. అక్కడి నుంచి రోజు ట్రక్కులకు ది పువ్వులు నగరాలకు రవాణా అవుతుంటాయి ఈ పల్లెలో కొంతకాలం క్రితం వరకు రైతులు పసుపు చెరకు పండించేవారు నీళ్లు ఉంటే పంట లేకపోతే లేదు ఎంత కష్టపడినా వచ్చే ఆదాయంతో పూట గడవడం కష్టంగా ఉండేది వెంట పడగా పడగా పంట అమ్మిన ఏడాదికి కానీ డబ్బు ఇచ్చేవారు కాదు అలాంటిది 2005లో ఒక వ్యవసాయ అధికారి సలహాతో నలుగురైదుగురు రైతులు ధైర్యం చేసి కొంత పొలంలో బంతిపూల సాగు చేపట్టారు తక్కువ సమయంలోనే వారి చేతికి డబ్బు అందడం చూసి మిగిలిన రైతులు ఆకర్షితులయ్యారు. క్రమంగా 170 మంది చిన్న రైతులు 200 ఎకరాలలో పూల సాగు చేపట్టారు బంతిపూలతో పాటు 8 రంగుల చేమంతులను పండిస్తూ రోజు 12 టన్నుల పూలను రక్కులలో నగరంలోని మార్కెట్ కి పంపుతున్నారు బంతి ఏడాది పొడుగునా పూస్తుంది కానీ చేయమంతులు మాత్రం కొన్నాళ్లే పూస్తాయి అయితేనే జీవితంలో మొదటిసారి లక్షలలో ఆదాయాన్ని కళ్ళ చూడగలుగుతున్నామంటే అది ఈ పూల చలవే అంటున్నారు. పూలంచవాసులు పువ్వులు లేని వేడుకలు ఉండవు కాబట్టి ఆదాయానికి ఢోకాలేదు ఈ ఊరి వాళ్లే పూల మొక్కల నర్సరీ కూడా నిర్వహిస్తూ చుట్టుపక్కల రైతులకు పూలతోటలు పెంచుకోవడానికి సహాయం చేస్తున్నారు




 రలాబా రజనగంధ

ఒడిశాలోని సముద్రతీర ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రలాబా గ్రామము సరిగ్గా పాతికల క్రితం వచ్చిన సూపర్ సైక్లోన్ ఆ ఊరిని అతలాకుతలం చేసింది 250 కిలోమీటర్ల వేగంతో పిలిచిన గాలులకు అక్కడే ప్రజల జీవనాధారమైన తమలపాకు తోటలు పోక చెట్లు నేలకూరిగాయి జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి వారికి చాలా సమయం పట్టింది తుఫాను గండం ఎప్పుడూ పొంచి ఉండేదే కాబట్టి పంటలను మార్చడమే మార్గం అనుకున్న రైతులు రజనీగంధ పూల సాగు వైపు మల్లేరు మొదట్లో 30 మంది 10 ఎకరాలలో ప్రారంభించగా ఇప్పుడు గ్రామంలోని 140 మంది రైతులు పూల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈసాగే చేస్తూ ఊరిని తమ జీవితాల్ని పరిమళభరితం చేసుకున్నారు వీటి వల్ల భూమిలేని వారికి కూడా చేతినిండా పని దొరికింది రోజు పువ్వులు కోయడం ప్యాక్ చేయడం నగరాలలోని పుష్పగుచ్చాల తయారీదారులకు సరఫరా చేయడం లాంటి పనులు చేస్తూ వారు ఉపాధి పొందుతున్నారు మొక్కలు నాటిన ఎనిమిది నెలలకు పూత ప్రారంభమవుతుంది ఇక అప్పటినుంచి ఎకరానికి ఏటా రెండున్నర లక్షల ఆదాయం గ్యారెంటీ చేయాల్సిందల్లా వారానికోసారి నీళ్లు పెట్టడమే అంటున్నారు రలాబా వాసులు




ఒకటి తుఫానులతో కొట్టుమిట్టాడే ప్రాంతం మరొకటి కరువు బారిన పడిన ప్రాంతం ఇంకొకటి వ్యాపార పంటల నీళ్లు దాహం తీర్చలేక అల్లాడుతున్న ప్రాంతం ఈ మూడింటి తలరాతని మార్చేసి ఒకనాటి పేద రైతులను నేడు లక్షాధికారులను చేస్తుంది పువ్వుల సాగు

ఏటా వాలంటైన్స్ డే నాడు ఆస్ట్రేలియా జపాన్ దుబాయ్ సింగపూర్ మలేషియా ఇలాంటి పలు దేశాలలో అమ్ముడు అవుతున్న ఎర్ర గులాబీలు ఎక్కడివో తెలుసా మనదేశంలోని పశ్చిమ కనుమలలో పూసినవి పూణే జిల్లాలో ఉన్న మావల్ గ్రామంలో ఒకప్పుడు వారి చెరకు ప్రధాన పంటలు రాను రాను ఆ పంటల నీటి దాహాన్ని తీర్చడం రైతుల వల్ల కాలేదు ప్రత్యామ్నాయాల వైపు దృష్టిసారించిన వాళ్లను గులాబీలు ఆకట్టుకున్నాయి 90వ దశకంలో టాటా సంస్థ ఓరియంటల్ ఫ్లోరా టెక్ని ప్రారంభించి డచ్ రోజెస్ని సాగు చేసేది ఆ తర్వాత కొన్ని సంస్థలు కూడా ఈ ప్రయోగం చేశాయి కానీ అదంతా కార్పొరేట్ కంపెనీల వ్యవహారం అనుకున్న రైతులు చాలా కాలం అటువైపు చూడలేదు అలాంటిది గత దశాబ్దంలో ఒక్కొక్కరుగా మొదలుపెట్టి ఇప్పుడు పలువురు రైతులు ఈ బాట పట్టారు బాబు ఎకరంతో మొదలుపెట్టి 15 ఎకరాల వరకు పొలం ఉన్నవాళ్లు కూడా గులాబీ ఉత్పత్తిదారుల సంఘాలలో చేరి రంగురంగుల పువ్వుల్ని సాగు చేస్తున్నారు రోజు టన్నులకొద్దీ గులాబీలను దేశ విదేశీ మార్కెట్లకు పంపుతూ లక్షలలో సంపాదిస్తున్నారు పాలి హౌస్లలో బిందు సేద్యని అనుసరించడం వల్ల నీటికి సమస్య లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు గులాబీల సేద్యం వైపు వెళ్లడం విశేషం ఎకరం పొలం ఉన్న చాలు రోజుకు కనీసం రెండు వేల పువ్వులు వస్తాయని పూల సాగు చేపట్టాక మిగులు ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నామని చెబుతున్నారు ఇక్కడి రైతుల





29, ఫిబ్రవరి 2024, గురువారం

 జూలైలో ఇష్ట శతాబ్ది ఉత్సవాలు అర్జెంటీనా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయము అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్ ఇస్తా శతాబ్ది ఉత్సవాలను జూలై 1 నుంచి 5వ తేదీ వరకు ఇంగ్లాండులో నిర్వహించనున్నట్లు ఇష్టా అధ్యక్షుడు డాక్టర్ కేశవులు తెలిపారు అంతర్జాతీయంగా ఒకే రకమైన విత్తన పరీక్ష ప్రమాణాలను నిర్ణయించడం కోసం 1924లో స్విట్జర్లాండ్ లో ఇస్తా ఆవిర్భవించిందని పేర్కొన్నారు ఈ ఏడాదితో ఈ సంస్థ ఏర్పాటు వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలోనే శతాబ్ది ఉత్సవాల నిర్వహించనున్నట్లు తెలిపారు

28, ఫిబ్రవరి 2024, బుధవారం

చిరుధాన్యాల మహారాణి రాయి మతి

 చిరుధాన్యాల మహారాణి



ఒడిశా కోరాపుట్ జిల్లాకు చెందిన రాయి మతి ఘియురియా ను చిరుధాన్యాల మహారాణిగా పిలుస్తారు

ఈ గిరిజన రైతు 72 దేశవాళి ధాన్యం రకాలను 30 చిరుధాన్యాల రకాలను సంరక్షిస్తున్నారు. వీటిలో అరుదైన కుంద్రాబతి మండియా దసరా జువానా జెన్కోలి రకాలు కూడా ఉన్నాయి 16 ఏళ్లకే పెళ్లయిన రాయిమతి చిరుధాన్యాల పట్ల తన ప్రేమను ఏమాత్రం వదులుకోలేదు ఇంటి పనులు చేసుకుంటూనే పొలంలో వివిధ పంటలపై ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు ఏడాది కేడాది మెరుగైన పద్ధతులను అవలంబిస్తూ నాణ్యమైన చిరుధాన్యాలను పండిస్తున్నారు దేశవాళి విత్తనాల పరిరక్షణలో రాయి మతికి 70 ఏళ్ల కమలా పూజారి స్ఫూర్తిగా నిలిచారు పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా ఆయన కమల దగ్గర దేశవాళీ విత్తనాల సంరక్షణ పద్ధతులను ఆకలింపు చేసుకున్నారు ఆమె సూచన మేరకే చెన్నై కేంద్రంగా పనిచేసే ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ లో చేరారు అక్కడ విత్తనాల సంరక్షణలో ఆధునిక పద్ధతులు గ్రామీణ మహిళల ఉపాధి లాంటి అంశాల పట్ల అవగాహన తెచ్చుకున్నారు అందుకే నేను బడిలో ఏం చదువుకున్నానో గుర్తులేదు నాకు తెలిసిందల్లా విత్తనాలను భద్రపరచడం వాటిని పండించడం మాత్రమే సాగుభూమి నా బడి అని నవ్వుతూ చెబుతారు రాయి మతి తనకు తెలిసిన విద్యార్థులతోనే అంతరించిపోకుండా మరింతమందికి చేరువ చేస్తున్నారు చిరుధాన్యాల సాగుపై ఇప్పటివరకు 2500 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు రాయి మతి జీవితం అంటే చిరుధాన్యాలు అన్నంతగా ఆమెకు పేరు తెచ్చింది మీరు వచ్చింది. ఇప్పుడా మీ మహిళా రైతుల సహకార సంఘాన్ని నడుపుతున్నారు చిరుధాన్యాల పిండి వంటలు తయారు చేసే స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారు అంతేకాదు తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని వ్యవసాయ పాఠశాల నిర్మాణం కోసం దానం ఇచ్చారు గత ఏడాది ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో సంప్రదాయ అవార్డులు చిరుధాన్యాల రకాలను ప్రదర్శించే అరుదైన అవకాశం రాయి మతికి దక్కింది ఆమె చొరవకు రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రశంసలు అందాయి జాతీయస్థాయి గుర్తింపు నన్ను మా వాళ్ళ మధ్య గొప్పగా నిలబెట్టింది అంతర్జాతీయ నాయకుల ప్రశంసలకు అర్హురాలిని చేసింది ఈ గుర్తింపు మరిన్ని రకాలను సంరక్షించేలా మన దేశ గౌరవాన్ని మరింత ఇనుమడించేలా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంటారు రాహిమతి


26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఎలుకలకు చెల్లు చిట్టి

 ఎలుకల నివారణకు అద్భుత చిట్కా కనిపెట్టిన రైతు రాజిరెడ్డి ,దానికోసం ఎగబడుతున్న రైతులు.

ఎలుకల బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు కన్నమ్మ కష్టాలు పడుతుంటారు ఉచ్చులు పెట్టడం పొలం గట్లపై ఉన్న బొరియల నుంచి వాటిని తరిమేయడానికి పొగ పెట్టడం పురుగుమందులను ఉంచడం లాంటివి ఏమి చేసినా ఎలుకల సమస్య రైతులను పట్టిపీడిస్తూనే ఉంటుంది దీనికి విరుగుడుగా ఇప్పుడు ఒక కొత్త పద్ధతిని రైతుల అవలంబిస్తున్నారు. మూడు మీటర్ల ఎత్తులో ఉండే ఒక కర్రకు చిట్టి కట్టి పొలంలో నాటితే చాలు ఇక ఎలుకల బెడద ఉండనే ఉండదట సిద్దిపేట జిల్లాలోని వందలాది రైతులు ఇప్పుడు ఈ ఎలుకల చిట్టి కోసం దీని రూపకర్త రైతువైన రాజిరెడ్డికి దగ్గరికి పరుగులు తీస్తున్నారు ఇది మూఢనమ్మకమే అయినా ఎలుకల బెడద నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న తాపత్రయానికి ఉదాహరణగా నిలుస్తోంది భూంపల్లిలోని నాగారం గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇంటి దగ్గరికి వరి రైతులు బారులు తీరుతున్నారు ఎలుకల చిట్టిల కోసం ఎంత డిమాండ్ ఏర్పడిందంటే ఏకంగా నాలుగు గంటల పాటు క్యూలో నిలబడవలసి వస్తోంది రైతులు తమ పేరు భూమి విస్తీర్ణం గ్రామం పేరు తదితర వివరాలు ఇస్తే ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని సర్వే నంబర్ తో సహా రాసి రాజిరెడ్డి ఇస్తాడు చిట్టి అందుకున్నాక ఎక్కడ ఆగకుండా నేరుగా పొలానికి వెళ్లి చిట్టి కట్టిన కర్రను నాటాలి ప్రతి సీజన్లో ఎలుకల వల్ల 80 నుంచి 90% పంటకు నష్టం వాటిల్ లేదని ఈ చిట్టిని కట్టడం వల్ల ఆ బాధ తప్పిందని నారాయణరావుపేటకు చెందిన రైతు మహంకాళి బిక్షపతి చెత్త తెలిపారు తాను గత ఐదేళ్లుగా ఈ చిట్టిని పొలంలో కడుతున్నానని చెప్పారు ఈ విషయం బాగా ప్రాచుర్యం పొందడంతో సిద్దిపేటతో పాటు పొరుగున ఉన్న రాజన్న సిరిసిల్ల ఇతర జిల్లాల రైతులు కూడా రాజిరెడ్డిని కలవడానికి వస్తున్నారట నిత్యం 100 మందికి పైగా ఈ చిట్టిలను తీసుకొని వెళుతున్నారని చెబుతున్న రాజిరెడ్డి ఒక్కో చిట్టికి 50 నుంచి 100 రూపాయల దాకా వసూలు చేస్తున్నానని తెలిపారు అయితే ఆ చిట్టీలు రాసిన అక్షరాలను ఎవరో చదవలేక పోతున్నారు ప్రాచీన తెలుగు భాషకు సంబంధించినటువంటి అక్షరాలేవో ఉన్నట్లు తెలిసింది

వైల్డ్ ఫ్లేవర్స్ తేనె ఉత్పత్తి ఆవిష్కరణ

 సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు అటవీ కళాశాల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారుచేసిన ఆర్గానిక్ సేంద్రియ తేనెను ఆమె సోమవారం ఆవిష్కరించారు రైతులకు తేనెటీగల పెంపకము ఆదాయ అభివృద్ధిపై శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ శివారు ములుగు లో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకము ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పినట్లు చెప్పారు రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు మహిళలకు తేనెటీగల పెంపకం పై వారం రోజుల శిక్షణ కార్యక్రమాలను ఫారెస్ట్ కాలేజీ అందిస్తుందని వెల్లడించారు సేంద్రియ పద్ధతుల్లో అభివృద్ధి చేసిన తేనెను వైల్డ్ ఫ్లేవర్స్ బ్రాండ్ పేరిట ఫారెస్ట్ కాలేజీ అందుబాటులోకి తెస్తున్నదని వివరించారు ములుగు ఫారెస్ట్ కాలేజీలో త్వరలో ఒక తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు డే ని ప్రియాంక వర్గీస్ తెలిపారు కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ పిసిసిఎఫ్ ఆర్ఎం డొబ్రియెల్ గా పిలుస్తున్నారు తదితరులు పాల్గొన్నారు

23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

వరి సిరి ఆస్మా అబూబకర్

 కర్ణాటకలోని ముర తన్గాడి కి చెందిన అబుబకర్ హోటల్ వ్యాపారి అతని భార్య ఆస్మా చదువుకుంది ఉద్యోగం చేసేది ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్ళింది భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది తమకున్న చిన్నపాటి కమతంలోని సాగు చేయాలని ఉంది కానీ గ్రామాల్లోని పరిస్థితులు ఆమెను కలవరానికి గురిచేశాయి రైతులు సేద్యానికి దూరమవుతున్న తీరు బాధపెట్టింది మిగిలిన కొద్దిమంది కూడా వాణిజ్య పంటలకే పెద్ద పీట వేస్తున్నారు అది హైబ్రిడ్ విత్తనాలకే ప్రాధాన్యమిస్తున్నారు దీని వలన దేశ వాడి విత్తనాలు కనుమరుగైపోతున్నాయని అర్థమైపోయింది ఆత్మ ఆ పరిస్థితిని తానే ఎందుకు చక్కదిద్దకూడదని అనుకుంది దశాబ్ద కాలంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ అరుదైన దేశవాళి విత్తనాలు సేకరిస్తున్న వాటిలో వరి రకాల ఎక్కువ అంతరించిపోతున్న పంటలు ఆమె చొరవ వల్ల మళ్ళీ జీవం పోసుకున్నాయి ఈ ప్రయత్నంలో శ్రమ ఎక్కువ ఖర్చు ఎక్కువ తన జీవితంలో నుంచి కొంత భాగాన్ని ఎందుకు కేటాయిస్తుంది ఆత్మ ఇప్పటిదాకా తను 840 దేశవాళీ రకాల విత్తనాలను సేకరించింది అందులో 85% విత్తనాలను పంటగా మార్చగలిగిన వాటిని స్థానిక రైతులకు ప్రభుత్వానికి కూడా అందిస్తుంది ఈ ఉద్యమంలో నా భర్త సహకారం మరువలేనిది అని చెబుతున్నది .

Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE