13, మార్చి 2024, బుధవారం

రైతు బడి వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డికి ఐ ఐ ఐ టీ డీ ఆహ్వానం

 ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈనెల 15 16 తేదీలలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రేరణుర్షిప్ సమ్మిట్ 2024లో పాల్గొని ప్రసంగించాలని తెలుగు రైతు బడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఆహ్వానించింది ఆయన తెలుగు రైతులకు డిజిటల్ మీడియా ద్వారా వ్యవసాయ సమాచార అందిస్తున్నారు సదస్సులో వ్యవసాయం అనుబంధ రంగాలలో యువతకు ఉన్న సరికొత్త అవకాశాల గురించి వివరించాలని సంస్థ కోరింది

హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సు

 జూన్ 4 నుంచి 6 వరకు నిర్వహణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 28 దేశాల నుంచి 500 మంది హాజరు అంతర్జాతీయ కామారెడ్డి సంస్థ అంతర్జాతీయ వారి పరిశోధనా సంస్థ తెలిపాంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులో ప్రపంచ వరి సదస్సు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు వచ్చే జూన్ 4వ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు హైదరాబాద్ లో ఈ సదస్సు జరుగుతుంది సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది సదస్సులో 28 దేశాల నుంచి దాదాపు 500 మంది శాస్త్రవేత్తలు వ్యాపార సంస్థల ప్రతినిధులు ఎగుమతి దిగుమతి దారులు విద్యావేత్తలు వ్యవసాయ పారిశ్రామికవేత్తలు వరి అనుబంధ ఉత్పత్తుల రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు అని ఆయన వివరించారు ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు తెలంగాణలో పండే వారికి పరి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం ద్వారా డిమాండ్ కల్పించడం మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ఈ సతస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు ఈ జతస్సులో ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న వరి రకాలను ప్రదర్శించడమే కాకుండా వాటి ప్రాధాన్యతలను వివరిస్తారని మంత్రి తెలిపారు మన దేశం నుంచి బియ్యం ఒక కోటి 77 లక్షల 86 వేల 92 టన్నులు కాగా అందులో తెలంగాణ నుంచి కేవలం 22,498 మెట్రిక్ టన్నులేనని పేర్కొన్నారు తెలంగాణ నుంచి దాదాపు 8,000 క్వింటాళ్లు సర్టిఫైడ్ విత్తనాన్ని కూడా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని వివరించారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం రకాల ఎగుమతులపై విధించిన నిషేధం వల్ల సన్న బియ్యం పండించిన రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాక రైతులు కొనుగోలు సెంటర్లలో అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు

10, మార్చి 2024, ఆదివారం

ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ

 మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక చర్చ గిరిజన మహిళల పాత్ర పై అభినందనలు భరతనారి శక్తి అద్భుతమని భక్తుల కితాబు

ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలు గిరిజనులు సాగు చేసే అరకు కాఫీకి అంతర్జాతీయంగా మరో ఘనత దక్కింది ఐక్యరాజ్యసమితిలో అరకు కాఫీ పై ప్రత్యేక చర్చ జరగడంతో పాటు ప్రశంసలు లభించాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా అరకు కాఫీ ప్రయాణంపై ప్రత్యేక చర్చ జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఐక్యరాజ్యసమితి నాయకులు అరకు కాఫీని భారత నారీ శక్తిని ప్రశంసించారు భారత అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అన్నారు వ్యవసాయం ఆర్థిక డిజిటల్ సాంకేతికత ఆరోగ్యం విద్య అంతరిక్షం విమానాయన రంగాలలో భారత మహిళలు రాణిస్తున్నారు ప్రశంసించారు అరకు కాశీకి అంతర్జాతీయంగా పేరు రావడంలో గిరిజన మహిళలు ఎంతో కృషి చేశారని కొనియాడారు గిరిజన మహిళల విజయగాత స్ఫూర్తిదాయకమన్నారు ఈ ఏడాది జనవరిలో తాను భారత పర్యటనకు వెళ్ళినప్పుడు నారి శక్తిని ప్రత్యక్షంగా చూశానని గుర్తుచేసుకున్నారు ఆ ప్రాంత గిరిజనులకు సాధికారత గౌరవము లభించాలని వక్తలు పేర్కొన్నారు అరకు కాఫీ ఎంతో రుచిగా నాణ్యతగా ఉండేలా గిరిజనులు స్థిరమైన సాగు పద్ధతులు పాటిస్తున్నారని భారత ప్రతినిధి బృందం పేర్కొంది కాఫీ సాగు నుంచి కోత వరకు ఉత్పత్తి ప్రక్రియలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించింది.

5, మార్చి 2024, మంగళవారం

గోడౌన్ లోని పంటపై లోన్

 ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉన్న గోడౌన్లో రైతులు తమ పంటలను స్టోర్ చేసుకుంటే వీటిపై లోన్లు పొందేందుకు కేంద్రం వీలు కల్పిస్తోంది ఎందుకు సంబంధించి ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ సోమవారం ఈ కిసాన్ ఉపజ నిధి డిజిటల్ ప్లాట్ఫార్మ్ ను లాంచ్ చేశారు ఈ ఇనిషియేటివ్ తో రైతుల ఆదాయాలు పెరుగుతాయని అన్నారు వేరే హౌస్ ఓనర్లు చెల్లించి సెక్యూరిటీ డిపాజిట్లను స్టాక్ విలువలో ఒక శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు ప్రస్తుతం ఇది మూడు శాతంగా ఉంది

వంట నూనెల దిగుమతులు తగ్గించేందుకు కొత్త మిషన్. వంట నూనెల దిగుమతులను తగ్గించుకోవడానికి నూనె గింజల ప్రొడక్షన్ పెంచేందుకు ఒక మిషన్ లాంచ్ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సోమవారం పేర్కొన్నారు ఇందుకోసం 11, కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నమని అన్నారు దీనితో పాటు అస్సాంలో ఏర్పాటు చేసిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ఆయన ప్రారంభించారు ఇండియా ఏడాదికి 1.6 కోట్ల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకుంటుంద

ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం

 మా మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో నాలుగు జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం పప్పులు తదితర ఉత్పత్తులను అవని ఆర్గానిక్స్ పేరుతో విశాఖ నగరంలోని నాలుగు రైతు బజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికీ కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతుంది ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోని ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచనను ప్రోత్సహించిన ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్లు ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు బాక్ చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం స్థలంతో పాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది వైర్ ఫెన్సింగ్ డ్రిప్పులు సిబ్బంది జీతాలను మా ఎఫ్ బి ఓ సమకూర్చుతోంది నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటి పంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ళవచ్చు స్కూలు విద్యార్థులకు ఇంటి పంటలు ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశం అని మేం భావిస్తున్నాం యూనివర్సిటీలో ఈ పంటలను రెండు ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది

ఉషా రాజు ఏయూ అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెన్ హబ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం



3, మార్చి 2024, ఆదివారం

45 రోజులకే పొట్టకొచ్చిన వరి పంట

 సాధారణంగా వారి నాటు వేసిన తర్వాత మూడు నెలలకు పొట్టదశకు వస్తుంది కానీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు కిరణ్ సాగు చేసిన వారి 45 రోజులకే పుట్టదశకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది కిరణ్ వివిధ రకాల కంపెనీలకు చెందిన 27 విత్తన సంచులను కొనుగోలు చేసి పంట వేశాడు ఇందులోని ఏడు సంచుల విత్తనాలలో తేడా వచ్చినట్లు రైతు తెలిపాడు సుమారు మూడు ఎకరాలలో సాగుచేసిన వారి 45 రోజులకే పొట్ట దశకు వచ్చినట్లు పేర్కొన్నాడు ఈ ప్రాంత రైతులు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా విత్తనాలు తీసుకొచ్చి నాట్లు వేశారు. వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు



2, మార్చి 2024, శనివారం

రైతులకు ప్రత్యేక శిక్షణ

 జాతీయ పురుగు తెగులు నిఘా సంస్థకు చెందిన మొబైల్ యాప్ పై భిక్కనూరు రైతు వేదికలు రైతులకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్ జీడిమెట్ల లోని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారి సునీత ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పదిమంది ఆదర్శ రైతులకు యాప్ వినియోగము పనితీరు ఉపయోగాలను వివరించారు సహాయ సస్యరక్షణ అధికారులు నీలా రాణి రవిశంకర్ శ్వేతా సుధా రైతులు సంతోష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాజిరెడ్డి నరేష్ స్వామి పాల్గొన్నారు



Featured post

RAITHU SANGHAM ( FARMERS ASSOCIATION )( ABHINAV FARMERS CLUB ,PUNE)

BENEFITS OF FARMING FARMERS ASSOCIATION - ABHINAV FARMERS CLUB ,PUNE