తక్కువ విస్తీర్ణం గల భూమిలో అధిక దిగుబడులు సాధిస్తున్న జగిత్యాల జిల్లా మహిళా రైతు కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.
సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన బండారి విజయ ప్రతిష్టాత్మకమైన మహిళా కిసాన్ దివస్ అవార్డుకు ఎంపికయ్యారు. ఒక ఎకరం విస్తీర్ణంలోనే 14 రకాల కూరగాయలను సాగు చేస్తూ , అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందుతూ విజయ సాధిస్తున్న తీరు ఆమెను ప్రత్యేకంగా నిలిపింది మహిళా రైతులను ప్రోత్సహించడం ,వ్యవసాయ రంగంలో వారు సాధిస్తున్న విజయాలను గుర్తించడం లక్ష్యంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏటా అక్టోబర్ 15 తేదీన " మహిళా కిసాన్ దివస్" ను నిర్వహిస్తూ అవార్డులను అందిస్తోంది.