భూసార పరీక్షలు చేయించాలనుకుంటే.. ఏ పంట వేయాలో నిర్ణయించాలనుకుంటే.. తెగులుకు పరిష్కారం కావాలనుకుంటే .. ఎరువుల గురించి.. వివిధ పథకాల గురించి .. ఇలా అన్నదాతల సమస్యలు, సందేహాలకు సమాధానం చెప్పేందుకు 1800-180-1551 టోల్ ఫ్రీ నంబర్ తో రాష్ట్ర వ్యవసాయ శాఖ కిసాన్ సహాయ కేంద్రం ను ప్రారంభించింది.
ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దీని సేవలు రైతులకు లభిస్తాయి. రైతుల ప్రశ్నలకు నిపుణులు తెలుగులో జవాబిస్తారు. ఎరువుల యాప్ , పత్తి కొనుగోళ్లకు సంబంధించిన కిసాన్ కపాస్ యాప్ ల పై సాంకేతిక సందేహాల నివృత్తికి కూడా రైతులు ఈ నంబర్ ను వినియోగించుకోవచ్చు.