Friday 2 February 2024

వ్యవసాయ రంగానికి అగ్రి షో తో మేలు

 అగ్రి షో కిసాన్ 2024 ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయ యాంత్రీకరణలో కీలక భూమిక పోషిస్తున్న కంపెనీలు నిపుణులు ప్రగతిశీల రైతులు మరిన్ని ఆలోచనలకు ఈ వినూత్న కార్యక్రమం మరింత పదం పెడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు వ్యవసాయరంగా అభివృద్ధికి కృషి చేస్తున్న విభిన్న వాటాదారులను ఒకచోటకు చేర్చే అగ్రిషో కిసాన్ 2024 కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల గురువారం హైటెక్స్ లో ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ ఇలాంటి అగ్రిశువుల వల్ల వ్యవసాయ రంగం మరింత ముందుకు సాగుతుందని అన్నారు అగ్రి షో ఈనెల మూడవ తేదీ వరకు కొనసాగానుంది దీనిలో వ్యవసాయ యంత్రాలు నూతనంగా రూపొందించిన పనిముట్లు ట్రాక్టర్లు, వాటర్ ఇరిగేషన్ సొల్యూషన్స్ వివిధ రకాల పనిముట్లు వినూత్న ఆవిష్కరణలు అంకుర సంస్థలు కాంట్ రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్ సహా విస్తృతమైన ఉత్పత్తులు సేవలను ప్రదర్శిస్తారు కాగా మొక్కలను పెంచడం అంటే భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమేనని మంత్రి అన్నారు గురువారం నగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హార్టికల్చర్ అగ్రికల్చర్ ప్రదర్శనను మంత్రి తుమ్మల ప్రారంభించారు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం ప్రేమికులు ఎంతోమంది ఉన్నారని ఇండ్లు టెర్రస్ బాల్కనీలో మొక్కలు పెంచుకునే ఆసక్తి ఉన్నవారికి ఈ మేళాతో ఎంతో ఉపయోగమని అన్నారు.