Thursday, 22 February 2024

రైతుకు టెక్ సాయం

 దుక్కి దున్ని నారు పోసి పంట పండించాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు అంత కష్టపడిన తీరని నష్టాలతో అప్పుల ఊబిలో కూలికిపోయినా అన్నదాతల కథలెన్నో అందుకు ప్రధాన కారణం వారికి సరైన సమాచారం మార్గదర్శనం లేకపోవడమే అంటుంది సాయి గోలే ఐఐటి మద్రాసులో చదివిన ఆమె తన స్నేహితుడితో కలిసి భారత అగ్రి పేరిట వ్యవసాయదారుల కోసం ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చింది సాగుకు సాంకేతికతను జోడించి ఉత్పత్తి పెంచి రైతులు సాధికారతవైపు అడుగులు వేయిస్తుంది

రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిగా నేను తెలుసుకున్నది ఏమిటంటే వ్యవసాయం ఒక సంక్లిష్టమైన శాస్త్రం దానిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు అయితే చిన్నప్పటి నుంచి పంట పొలాల మధ్య పెరిగాను కాబట్టి రైతుల బాధలు వాళ్ళు ఎదుర్కొనే సవాళ్లు సమస్యలపై కొంత అవగాహన ఉంది ముఖ్యంగా అన్నదాతల ఆత్మహత్యలతో మా ఊరి పేరు ఎప్పుడు వార్తల్లోకి ఎక్కేది ఇది నన్ను కలవర పెట్టేది మహారాష్ట్రలోని ఆర్వి గ్రామం మాది నాగపూర్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఊరు చదువుల నిమిత్తం మా కుటుంబం నాగపూర్ కు మారింది ప్రతి శనివారం ఆర్వీలోని మా మామయ్య ఇంటికి వెళుతుండే వాళ్ళం ఆయన వ్యవసాయ క్షేత్రంలో గడిపే వాళ్ళం ఎక్కువగా పత్తి సోయాబీన్ శనగలు పండించేవారు అది అంత లాభసాటిగా ఉండేది కావు కాలేజీలో చదివే రోజుల్లో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలేంటని మా మామయ్యను అడుగుతుండే దాన్ని ఆయన విశ్లేషణలు సమీక్షలు నాకు సంతృప్తి ఇవ్వలేదు

కాలం చెల్లిన పద్ధతులు... మామయ్యతో మాట్లాడిన తర్వాత చదువు లేకపోవడం ఇంకా కాలం చెల్లిన పురాతన వ్యవసాయ పద్ధతుల మీద ఆధారపడడం రైతుల అభివృద్ధికి ఆటంకంగా మారిందని నాకు అర్థమైంది ఇవాళ రేపు ఏ ఇతర రంగం తీసుకున్నా అందులో విద్యావంతులు ఉంటున్నారు కానీ రైతుల విషయం వచ్చేసరికి ఆ సంఖ్య అత్యాల్పం ప్రధానంగా వాతావరణ ప్రభావాలను తట్టుకోగలిగే వ్యవసాయ విధానాలపై వారికి ఉన్న పరిజ్ఞానం పరిమిత. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలంటే అందుకు నేనేం చేయగలను ఐఐటి మద్రాస్ లో చదవడానికి చెన్నై వెళ్ళినప్పుడు కూడా నాకు ఇదే ఆలోచన మా ఊర్లో వ్యవసాయం ఎలా సాగుతుందనేది ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునే దానిని పదేపదే అక్కడ రైతులు వెలిబుచ్చిన ఆందోళన ఏంటంటే ప్రతి సీజన్లో నష్టాలు సరిచూస్తున్నామని వాళ్లు అధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నవారే పంట చేతికి రాకపోతే అప్పుల పాలవుతున్నారు. మరింత ఆందోళనకర అంశం ఏమిటంటే కొందరు తీసుకున్న అప్పు తీర్చలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు దాంతో వారి కుటుంబం దిక్కులేనిది అయిపోతుంది

ఏం చేయాలి... అత్యవసరంగా చేయాల్సింది రైతుకు భరోసా కల్పించడం ఎప్పుడు ఏ పంట వేయాలి? దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎందులో పెడితే నష్టపోతాము ఒకవేళ రుణం తీసుకుంటే వడ్డీలు ఎంత కట్టాలి ఇలాంటి ఎన్నో విషయాల్లో వారికి పూర్తిస్థాయి అవగాహన లేదని నా అధ్యయనంలో తేలింది మా మామయ్య అనే ఉదాహరణగా తీసుకుంటే పత్తి ఎందుకు పండిస్తున్నాము దానికి సమాంతరంగా వేరే పంటలు ఎందుకు వేయడం లేదు తదితర విషయాలపై ఆయనకున్న అవగాహన నామ మాత్రమే ఆధునిక వ్యవసాయం గురించి మొక్కుబడిగా పాఠాలు చెప్పి వదిలేస్తే పరిస్థితులు మార్పు రాదు అందుకే వీటన్నిటిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి మార్గదర్శనం చేసే ఒక వ్యవస్థ కావాలి అంటే ఒక కన్సల్టెన్సీ లాగా స్నేహితుడితో కలిసి ఇదే విషయాన్ని నాతో పాటు ఐఐటీలో చదువుతున్న సిద్ధార్థకు చెప్పాను కావలసినంత పెట్టుబడి పెట్టిన లాభాలు పొందడంలో విఫలమవుతున్న మా కుటుంబాన్ని ఉదాహరణగా చూపించాను దీనిపై అతడు కూడా ఎంతో ఆసక్తి కనపరిచాడు మరింత లోతైన అధ్యయనం చేయాలన్న ఉద్దేశంతో ఎంటెక్లో బయోటెక్నాలజీని సబ్జెక్టుగా ఎంచుకున్నాడు నేను కూడా అదే బాటలో నడిచాను ఇద్దరం కలిసి వ్యవసాయంపై అధ్యయనం చేశాము విలువైన సమాచారం ఎంతో సేకరించాం సాంకేతికతతో సాగును అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పించింది మాస్టర్స్ తర్వాత ఇద్దరం కలిసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఒక ప్రాజెక్టు చేశాను అక్కడ వ్యవసాయ శాస్త్రం నేలసారం మొక్కల రోగ నిర్ధారణ కీటకాలు తదితర ఎన్నో అంశాల గురించి తెలుసుకున్నాము. తర్వాత నేను ఐటీసీలో చేరాను సిద్ధార్థ వ్యవసాయ శాస్త్రంలో మరింత అధ్యయనం కోసం ఇజ్రాయిల్ వెళ్ళాడు సిద్ధార్థ భారత్ కు తిరిగి వచ్చాక నేను నా ఉద్యోగం వదిలేశాను పూనే వెళ్లి ఒక వ్యవసాయ క్షేత్రం తీసుకొని ప్రయోగాలు ప్రారంభించాము రైతుకు సరైన సమయానికి సరైన సమాచారం అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించాం దానికోసం 2017లో భారత్ అగ్రి పేరిట ఫామ్ సొల్యూషన్స్ కంపెనీ ఒకటి బెంగళూరులో ప్రారంభించాం మహారాష్ట్రలోని నారాయణగౌలు ఏడాది పాటు ప్రయోగాత్మకంగా ఉపయోగించాము. సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రమంతటా క్రమంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా సేవలు విస్తరించాము వ్యవసాయానికి సంబంధించి 350 కి పైగా పంటల సమాచారంతోపాటు వాతావరణ పరిస్థితులకు తగిన సూచనలు సలహాలు ఇస్తున్నాము సమస్యలు ఎదురైతే వాటి పరిష్కార మార్గాలు కూడా చూపుతున్నాము వ్యక్తిగతంగా రైతుల కోరిన సేవలను అందిస్తున్నాను. వారి సౌకర్యం కోసం యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చాము మా సేవలు పొందిన రైతులు ఆదాయంలో ఇప్పుడు 40 నుంచి 50% వృద్ధి కనిపిస్తోంది నిథులు సేకరించి ఆర్థిక స్తోమత కలిగిన రైతులకు అండగా నిలుస్తున్నాం 2020 ఫోబ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 30 అండర్ 30లో చోటు తగ్గించుకోవడం గర్వంగా ఉంది రాబోయే రెండేళ్లలో దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు మా కంపెనీని విస్తరించేదుకు ప్రణాళికలు సిద్ధం చేశాము