ప్రత్యేక పోర్టల్లను ప్రారంభించిన కేంద్రం.. గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయదారులకు ఫసల్ బీమా సహా ఇతర బీమా సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సారథి అనే పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా గురువారం ప్రారంభించిన ఈ పోర్టల్ లో బీమా పాలసీల కొనుగోలు ప్రీమియం చెల్లింపులు వంటివన్నీ సేవలను పొందవచ్చు అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారానికి కృషి రక్ష పోర్టల్ 14447 హెల్ప్ లైన్ నెంబర్ ను ప్రారంభించారు దీంతో పాటు ఫసల్ బీమా కిసాన్ క్రెడిట్ కార్డు ఎంఐఐఎస్ పథకాలపై మరింత అవగాహన కల్పించేందుకు కావలసిన సమాచారాన్ని కూడా వ్యవసాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది..