వరి సాగుకు కొత్త విధానాన్ని కనుగొన్న ఐఐటి మద్రాస్. తక్కువ నీటితో వరి చెరుకు పండించడమే లక్ష్యం.
భారతీయ వరి సాగు పై జరిగిన ఒక వివరనాత్మక అధ్యయనం ప్రకారం.. ఒక కిలో బియ్యం పండించడానికి సగటు న 1500 నుండి 2000 లీటర్ల నీరు అవసరం. వర్షాల పై ఆధారపడకుండా భూగర్భ జలాలని విపరీతంగా తోడేసే పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో ఈ కిలో బియ్యానికి 2270 నుంచి 2672 లీటర్ల వరకు అవసరమవుతుంది. భారతదేశం ఉపయోగించే మొత్తం మంచినీటి లో దాదాపు 90 శాతం వ్యవసాయానికే ఖర్చవుతుంది. చెరకు పంటకు కూడా భూమి ఎప్పుడూ తడిగానే ఉండాలి. భారతదేశపు అత్యున్నత సాంకేతిక సంస్థలలో ఒకటైన ఐఐటీ మద్రాస్ లో ఒకరు ఈ సమస్య వైపు దృష్టి సారించారు. ఐఐటి మద్రాస్ "ప్రిసిషన్ అగ్రికల్చర్ " అని పిలిచే విధానంపై దృష్టి సారిస్తున్నదని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి తెలిపారు. తక్కువ నీటిని ఉపయోగిస్తూ వరి, చేరుకు వంటి పంటలను పండించడమే ఈ ఖచ్చితత్వ వ్యవసాయం ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
"మిషన్ ప్రవర్తక్ " అనేది ఐఐటి మద్రాస్ సొంత టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ .సెన్సార్లు ,నెట్వర్క్, కంట్రోల్ సిస్టంలు దీని ప్రధాన రంగాలు .ఖచ్చితత్వ వ్యవసాయం రూపుదిద్దుకోవడానికి సరిగ్గా ఈ సాంకేతికలే అవసరం."ప్రిసిషన్ అగ్రికల్చర్ " కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా ఉపయోగించాలో కెనడా భాగస్వాములతో కలిసి ప్రవర్తక్ ఇప్పటికే ఉమ్మడి వర్క్ షాప్ లను నిర్వహించింది. ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటే ఒక్క మొక్కకు ఎంత అవసరమో అంతే ఇవ్వడం. ఒక బొట్టు కూడా ఎక్కువ ఇవ్వకపోవడం. ఆచరణలో మూడు అంశాలు కలిసి పనిచేస్తాయి. నేలలో పాతిపెట్టిన సెన్సార్లు తేమను కొలుస్తాయి, రైతు ఊహించి నీరు పెట్టడానికి బదులుగా ,పంటకు ఎప్పుడు దాహం వేస్తుందో నేలే చెబుతుంది. పొలమంతా నీటితో ముంచెత్తి వృధా చేయకుండా ,మొక్క వేర్లకు ఎంత కావాలో అంతే కొలత ప్రకారం చుక్కల రూపంలో నీటిని అందిస్తుంది. పై నుండి నిఘా ఉంచే శాటిలైట్ లు ,డ్రోన్లు పొలంలో ఏ భాగం పైరు సరిగ్గా పెరగడం లేదో ముందే పసి గడుతాయి. వరి విషయానికి వస్తే ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అనే పద్ధతి ద్వారా అంటే పొలాన్ని ఎల్లప్పుడూ నీటిలో ఉంచకుండా ,నీరు పెట్టిన తర్వాత కొద్దిగా ఆరనివ్వడం ద్వారా దిగుబడి తగ్గకుండా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించ వచ్చని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిరూపించారు. మారుతున్న వాతావరణం , పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పంటలకు నీటి దాహం మరింత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఖచ్చితత్వ వ్యవసాయం అనేది భారత్ కు ఎంతో అవసరం. తగ్గిపోతున్న నీటి వనరులతో భవిష్యత్తులో భారత్ తనకు తాను ఆహారాన్ని అందించుకోగలదా లేదా అనే దానికి ఇది సమాధానం.