Wednesday 26 December 2018

పాల ఉత్పత్తిలో జాగ్రత్తలు - వెన్న శాతం ప్రభావితం చేసే అంశాలు


పాలల్లోని వెన్నశాతం ఆధారంగానే పాల బిల్లులలో హెచ్చుతగ్గులు ఉంటాయి.రైతాంగం పాలల్లో వెన్న శాతం ఉండేందుకు దోహదపడే అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటే వారు ఉత్పత్తి చేసే పాలకు ఎక్కువ ధర లభించడంతో పాటు పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

పాలల్లో వెన్న శాతం ప్రభావితం చేసే అంశాలు.

1.పశువు జన్యుపరంగా సామర్థ్యం,జాతి,వయస్సు,పాడికాలం,ఈతల సంఖ్య,పాల దిగుబడి ,ఆహారం,వాతావరణం మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

2.ఆవుల్లో కంటే గేదెల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది.

3. సంకర జాతి,విదేశీ జాతి పశువుల్లో పాల దిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ ,గీర్,సాహివాల్వంటి దేశీయ ఆవుల్లో ,ముర్రా గేదెల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది.

4.పశువుల వయస్సు పెరిగే కొద్దీ వెన్న శాతం తగ్గుతుంది.

5.పశువులు ఈనిన 3-5 రోజుల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది.ఆ తర్వాత 2 మాసాల వరకు పాలదిగుబడి పెరుగుతుంది.వెన్న శాతం తగ్గుతుంది.ఈత చివర్లో ఎనిమిది మాసాలప్పుడు ,వట్టిబోయే దశలో పాల దిగుబడి తగ్గుతుంది.వెన్న శాతం పెరగడం గమనిస్తాము.సాధారణంగా పాడికాలం పెరిగే కొద్ది వారానికి 25 శాతం చొప్పున పాల ఉత్పత్తి తగ్గుతుంది.వెన్న శాతం పెరుగుతుంది.

6.వాతావరణంలో ఉష్ణోగ్రత 10 ఫారణీట్ లు ఎక్కువైతే వెన శాతం 0.1 - 0.2 శాతం చొప్పున తగ్గుతుంది.అందువల్ల వేసవిలో కంటే చలికాలంలో వెన్న సాతం ఎక్కువగా ఉంటుంది.అలాగే వేసవిలో ఉదయం,చలికాలంలో సాయంత్రం వేళల్లో పితికిన పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది.

7.పశువులు ఎదలో ఉన్నపుడు పాల ఉత్పత్తి,వెన్న శాతం తగ్గుతుంది.

8. పశువులు వ్యాధులకు లోనైనపుడు ,లేగదూడలు మరణించినప్పుడు వెన్న శాతం తగ్గుతుంది.

9. 203 కిలోమీటర్ల దూరం తిరిగి మేసివచ్చిన పశువుల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది.చాలా దూరం తిరిగి తీవ్రమైన బడలికకు గురైతే మాత్రం వెన్న శాతం తగ్గుతుంది.పశువు ఆరోగ్యం సరిగ్గా లేకుంటే కూడా వెన్న శాతం తగ్గుతుంది.

10.పాలు పితికే సమయంపై కూడా వెన్న శాతం ఆధారపడి ఉంటుంది.నెమ్మదిగా పాలు పితికితే పాల దిగుబడి,వెన్న సాతం తగ్గుతుంది.

11. పాలు పితికే వ్యక్తి మారినప్పుడు కూడా వెన్న శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయి.

12. ముందు పితికిన పాలల్లో కంటే చివరగా పితికిన పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది.

13.పశువులకందించే మేపుపై వెన్న శాతం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.వరి అన్నం,సోయా చెక్క,క్యాబేజీ,మొక్క జొన్న మొదలగునవి వెన్న శాతం తగ్గిస్తాయి.

14.పాలల్లో నీళ్లు కలిపినా ,పచ్చి గడ్డి ఎక్కువ మేసినా ,మేత మారినప్పుడు వెన్న శాతం తగ్గుతుంది.